
కళకి, కులం, మతం, ప్రాంతం ఉండదు. ఉందని అనుకునే వాళ్ళని చూసి సినిమాతో పాటు నటుల అభిమానులు, సినీ లవర్స్, ప్రేక్షకులు నవ్వుకుంటూ అవేమి ఉండవని ఎంతో మంది నటుల్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. అలాంటి ఒక నటుడు ప్రకాష్ రాజ్.నటనలో ఎన్ని రకాల కోణాలు ఉన్నాయో, కొత్తగా ఎన్ని కోణాలు పుడతాయో వాటన్నిటిలో లబ్ధప్రతిష్టుడు. కొంత గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులని తన నటనతో అలరించేందుకు ‘జగమే సంగీతం’ అనే అద్భుతమైన మ్యూజికల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సెప్టెంబర్ 4, 2026 నుండి ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో ప్రకాష్ రాజ్ ‘శాస్త్రి’ అనే అత్యంత కీలకమైన, క్రమశిక్షణ కలిగిన సంగీత విద్వాంసుడి రోల్ లో కనిపించబోతున్నాడు. అయితే ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ అభిమానులు, ప్రేక్షకులు, మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ కి ఒక ప్రత్యేకమైన మనవి చేస్తున్నారు. 'సార్ మీరు చాలా అద్భుతమైన యాక్టర్. మీరు సెల్యులాయిడ్ పై నటిస్తుంటే మేము పొందే ఆనందం అంతా ఇంతా కాదు. కానీ గత కొన్నాళ్లుగా మీరు రాజకీయపరమైన ,సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ అనవసర వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ వివాదాలు మీ అద్భుతమైన నటనని , సినిమాలని కొంతవరకు పక్కకు నెట్టివేస్తున్నాయి. దయచేసి ఎలాంటి వివాదాల జోలికీ వెళ్లకుండా, పొలిటికల్ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టండి" అని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
.webp)
Also Read: ఫేక్ కాస్టింగ్ కాల్స్: హెచ్చరించిన నిర్మాణ సంస్థ
'జగమే సంగీతం’ విషయానికి వస్తే సుప్రసిద్ధ ‘బండిష్ బండిట్స్’ ఆత్మతో తెరకెక్కిన ఈ సిరీస్‌ను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ రూపొందించగా, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. తరతరాల సంగీత వారసత్వాన్ని కాపాడుకోవాలనే తపన, కుటుంబ బాధ్యతలు, మనుషుల మధ్య భావోద్వేగాల చుట్టూ సాగే ఈ కథలో ప్రకాష్ రాజ్ నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.
[ Prakash Raj, jagame sangeetham, Prakash Raj Fans Request, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywoodnews ]




