TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

లక్ష్మీ మంచు కుమార్తెకు ప్రభాస్ సర్‌ప్రైజ్

Jun 17, 2020 9:41AM

లక్ష్మీ మంచు కుమార్తె విద్యా నిర్వాణ ఉంది కదా! ఆ చిన్నారికి యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే? మొన్న సోమవారం విద్యా నిర్వాణ పుట్టినరోజు. ఆ రోజున చిన్నారికి ప్రభాస్ బర్త్ డే విషెస్ చెప్పారు. అదీ వీడియో కాల్ చేసి, నేరుగా విద్యా నిర్వాణతో మాట్లాడారు. ప్రభాస్ తనకు ఫోన్ చేస్తారని, పేస్ టైమ్ లో మాట్లాడతారని అసలు ఊహించని చిన్నారి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బి అయింది. లక్ష్మీ మంచు ఈ సంగతి సోషల్ మీడియాలో షేర్ చేశారు. విద్యా నిర్వాణ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన వాళ్లకు లక్ష్మీ మంచు థాంక్స్ చెప్పారు. 

రెబల్ స్టార్ కృష్ణంరాజు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం ఉంది. ఎప్పటి నుండో స్నేహితులు. మోహన్ బాబు, ప్రభాస్ మధ్య సైతం మంచి అనుబంధం ఉంది. వాళ్లిద్దరూ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'బుజ్జిగాడు'లో కలిసి నటించారు. 

google-ad-img