
ప్రభాస్ బొమ్మ సెల్యులాయిడ్ పై పడితే చాలు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ సలాం హుజూర్ అంటూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం ముస్తాబవుతున్న చిత్రాలు ఫౌజీ, స్పిరిట్, కల్కి 2898 ad కి ఆ విషయం తెలుసు కాబట్టే వడివడిగా ముస్తాబవుతున్నాయి.
సాధారణంగా ఏ పెద్ద హీరో అయినా తన షూటింగ్ లేని రోజుల్లో విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంటాడు. కానీ ప్రభాస్ మాత్రం అందుకు భిన్నంగా 'ఫౌజీ' షూటింగ్ షెడ్యూల్‌లో తన షాట్స్ లేదా సీన్లు లేకపోయినప్పటికీ నేరుగా షూటింగ్ సెట్స్‌కి చేరుకుని ప్రొడక్షన్ పనులు దగ్గరుండి పరిశీలిస్తున్నాడు. సెట్స్‌లోనే ఉంటూ ప్రొడక్షన్ వ్యవహారాలు, సన్నివేశాల చిత్రీకరణను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుండటం వల్ల మేకర్స్, యూనిట్ సభ్యుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికుడి క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు.
Also read: ఏకైక విద్యార్ధినిగా రికార్డు: సుకుమార్ కూతురు సుకృతి వేణి సంచలనం
షూటింగ్ ఆఖరి దశకు చేరుకోగా, మిగిలివున్న 90 రోజుల చిత్రీకరణ షెడ్యూల్‌లో ప్రభాస్ ఏకంగా 60 రోజులకి పైగా కాల్షీట్లని కేవలం ఈ ప్రాజెక్ట్ కోసమే కేటాయించారు.ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ మరియు జయప్రద ముఖ్య పాత్రల్లో నటిస్తుండటం సినిమా రేంజ్‌ను మరింత పెంచింది. మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అభిమానులు అయితే 'ఫౌజీ' తో ఈ సారి కొన్నాళ్లపాటు ఎవరు క్రాస్ చెయ్యని రికార్డులు సృష్టించబోతున్నామనే నమ్మకంతో ఉన్నారు. షూరిటీ కింద ఇటీవల రిలీజైన ప్రభాస్ లుక్ చూపిస్తున్నారు.
Prabhas, Fauji, Hanu Raghavapudi, Imanvi







