Home

»

Latest News

Prabhas: ప్రభాస్ స్టైల్ లో మార్పులు 

Apr 27, 2026

ఫ్యాన్స్ యందు ప్రభాస్(Prabhas)ఫ్యాన్స్ వేరయా అనే సామెత ఎందుకు పుట్టిందో మొన్న డార్లింగ్ రీ రిలీజ్ రోజు చూస్తే అర్ధమయ్యేది. ఫ్యాన్స్ ఎవరో, పబ్లిక్ ఎవరో తెలుసుకోలేని రీతిలో నానా హంగామా సృష్టించారు. ప్రభాస్ కి మాత్రమే దక్కే అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రభాస్ కూడా తన అభిమానులు గర్వపడేలా తన సినీ లైనప్ ఉండేలా చూసుకుంటున్నాడు. రీసెంట్ గా నెట్టింట్లో ప్రభాస్ కి సంబంధించిన ఫ్రెష్ న్యూస్ ఒకటి అభిమానులని, నెటిజన్స్ ని చక్కిలిగింతకి గురి చేస్తుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.   


కల్కి  సీక్వెల్‌ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), కమల్ హాసన్ (సుప్రీం యాస్కిన్) లపై కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించే పనిలో నాగ్ అశ్విన్(Nag Ashwin) బిజీగా ఉన్నారు. ప్రభాస్ కూడా మరికొన్ని రోజుల్లో జాయిన్ కానున్నాడు. ప్రభాస్ పార్ట్ 1 ని మించి  మరింత పవర్‌ఫుల్ అప్పీరెన్స్‌తో కనిపించనున్నాడు. ముఖ్యంగా 'కర్ణ' క్యారక్టర్ కి  సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్  హైలైట్‌గా నిలవనున్నాయి. దీనికోసం ప్రభాస్ ఫిజిక్ మరియు హెయిర్ స్టైల్‌లో కొన్ని మార్పులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి భాగంలో కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే కనిపించిన కర్ణుడి పాత్ర, ఈసారి దాదాపు 30 నిమిషాల పైగా ఉంటుందని సమాచారం.

Also read:  ఈ మూవీ వల్ల 20 జంటలు ఆత్మహత్య.. ఇందుకు బాధ్యులు ఎవరు

సోషల్ మీడియాలో 'కల్కి 2' టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రానికి 'కర్ణ 3102 BC' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ద్వాపర యుగ అంతానికి, కలియుగ ఆరంభానికి మధ్య ఉన్న కాలాన్ని ప్రతిబింబించేలా ఈ టైటిల్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com