TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

కన్నప్పకి సంబంధించి ప్రభాస్ పరిస్థితి ఇదే..మంచు విష్ణు ఇలా చేస్తాడని ముందే తెలుసు

Jan 27, 2025 5:54PM

పాన్ ఇండియాస్టార్ ప్రభాస్(Prabhas)కల్కి 2898 ఏడి(Kalki 2898 ad)తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనపడబోయే మూవీ కన్నప్ప(Kannappa).పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మంచు విష్ణు(Manchu Vinshnu)టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రభాస్ గెస్ట్ రోల్ లాంటిది చేస్తున్న  విషయం తెలిసిందే.దీంతో 'కన్నప్ప' పై  అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.కాకపోతే ప్రభాస్ క్యారక్టర్ కి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తూ ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3న ప్రభాస్ క్యారక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తామని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది.ఈ మేరకు ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది.ఆ  పోస్టర్‌లో త్రిశూలంతో పాటు నుదుటున విభూది,తిలకంతో ప్రభాస్ లుక్ ఓ రేంజ్ లో   ఉండటంతో ఫిబ్రవరి 3 కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆశగా  ఎదురుచూస్తుంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.'కన్నప్ప' లో  ప్రభాస్ ఎలాంటి క్యారక్టర్ పోషిస్తున్నాడనే ఆసక్తి  కూడా అందరిలో ఉంది.

ఏప్రిల్ 25న 'కన్నప్ప' పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా ప్రభాస్, మంచు విష్ణు తో పాటు అక్షయ్ కుమార్,మోహన్ లాల్,మోహన్ బాబు(MOhan Babu),శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ లాంటి భారీ తారాగణం ప్రేక్షకులని కనువిందు చేయనుంది.మహాభారతం సీరియల్ ఫేమ్  ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 'అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు,విష్ణు తమ తమ కెరీర్ లోనే ఫస్ట్ టైం అత్యంత భారీ వ్యయంతో 'కన్నప్ప' ని  నిర్మిస్తున్నారు. నాస్తికుడైన 'తిన్నడు' ఆ తర్వాత  పరమేశ్వరుడి పరమ భక్తుడైన 'కన్నప్ప' గా ఎలా మారాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.

 

google-ad-img