TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

100 డేస్ ఆడిన చివరి సినిమా అదే: కౌంట్‌లెస్ డబ్బులు వచ్చాయంట.. పోసాని మళ్ళీ వచ్చేసాడు!

Nov 24, 2026 2:01PM


రచయితగా, నటుడుగా, దర్శకుడిగా పోసాని కృష్ణ మురళి  తెలుగు ఇండస్ట్రీని చెడుగుడు ఆడుకున్నాడని చెప్పడంలో ఎలాంటి అక్షర దోషం లేదు. కాకపోతే గత కొంత కాలంగా ఇండస్ట్రీలో తన చరిత్రకి గతమెంత ఘనంగా మారింది. అంటే నో సినిమాస్, ఏదో అడపా దడపా కనిపిస్తూ ఉన్నా ఆ చిత్రాలన్నీ ఉదయాన్నే థియేటర్స్ లో కనిపిస్తున్నాయి కానీ సాయంత్రానికి ఏమై పోతున్నాయో తెలియని పరిస్థితి. 

రీసెంట్ గా పోసాని ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు శ్రావణమాసం ఫ్లాప్ అయిన తర్వాత, ఒక ప్రముఖ దర్శకుడు పోసాని ఇంటికి వచ్చి, ఆయనకు సినిమాలు తీయడం ఎందుకు, డబ్బులన్నీ పోయాయని, ఇక ఖర్చులకు ఏం చేస్తారని అన్నారని పోసాని గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు తనను బాధించినప్పటికీ, వాటిని ఒక సవాల్‌గా స్వీకరించానని, సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఒక వ్యక్తి శూన్యంగా మారడని పోసాని గట్టిగా విశ్వసించారు.

మణిరత్నం లాంటి లెజెండరీ దర్శకుడు కూడా అనేక ఫ్లాపులను చవిచూశారని, అయినా ఆయన ఇప్పటికీ ఒక లెజెండరీ డైరెక్టర్ గానే కొనసాగుతున్నారని, కమల్ హాసన్ సినిమాలు కొన్నిసార్లు సబ్జెక్ట్ లోపాల వల్ల ఫ్లాప్ అవుతాయి తప్ప, ఆయన ప్రతిభకు లోపం కాదని అభిప్రాయపడ్డారు. రామ్ గోపాల్ వర్మ భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరు. టెక్నిక్ పట్ల ఆయనకు ఉన్న పట్టు, షార్ప్‌నెస్, క్రియేటివిటీ మరెవరికీ లేవని ప్రశంసించారు.

తాను రెండేళ్లు ఆయనతో కలిసి ప్రయాణించినందున ఆయన ప్రతిభను దగ్గరగా చూశానని, రామ్ గోపాల్ వర్మ ఒక జీనియస్ అని అన్నారు. శ్రావణమాసం ఫ్లాప్ తర్వాత, తాను తన ఫైనాన్షియర్‌కు ఒక ఆస్తిని అమ్మి డబ్బులు తిరిగి ఇచ్చేశానని పోసాని తెలిపారు. ఆ తర్వాత, మళ్లీ సినిమా తీసేందుకు అదే ఫైనాన్షియర్ వద్దకు వెళ్లగా, వారు ఎటువంటి సంకోచం లేకుండా మీకు కావాల్సినంత తీసుకోండి మురళి గారు. మీకు సినిమా ఫ్లాప్, హిట్ మాకేమీ లేదు, అంతకుముందు క్లియర్‌గా కట్టారు కదా అని చెప్పి ఆర్థిక సహాయం అందించారని పోసాని గుర్తు చేసుకున్నారు. అది వారి నమ్మకానికి, పోసాని నిజాయితీకి నిదర్శనం.

ఇది కూడా చదవండి: డింపుల్‌ హయాతి పెళ్లి: పెళ్లి కొడుకు ఇతనే.. ఇప్పుడు క్లియర్ గా అందరకి అర్థమైంది!

ఆ తర్వాత పోసాని తన సొంత కథతో ఆపరేషన్ దుర్యోధనను రూపొందించారు. ఫైనాన్షియర్ కథ విన్న తర్వాత ఇది మీరే చెప్పాలి, మీరే చేయాలనుందా, నేను చేసుకోవచ్చా అని అడిగినట్లు, కథలోని దమ్ము ఆయనకు అర్థమైందని పోసాని వివరించారు. అలా ప్రారంభమైన ఆపరేషన్ దుర్యోధన అనూహ్య విజయాన్ని అందుకుంది. ఆపరేషన్ దుర్యోధన ఎంత పెద్ద హిట్ అయిందో, కౌంట్‌లెస్ డబ్బులు వచ్చాయని పోసాని అన్నారు.

 తెలుగు సినీ చరిత్రలో ఒక రికార్డును సృష్టించింది. అన్ని సెంటర్లలో వంద రోజులు ఆడిన చివరి తెలుగు చిత్రంగా ఆపరేషన్ దుర్యోధన నిలిచిందని పోసాని సగర్వంగా ప్రకటించారు. ఆ తర్వాత వంద రోజులు ఆడిన సినిమాలు ఏవీ లేవని, ఆ ట్రెండ్ కూడా లేకుండా పోయిందని తెలిపారు. తనను విమర్శించిన వారందరికీ ఈ విజయం సమాధానం చెప్పిందని, ఒక ఫ్లాప్ సినిమాతో ఎవరినీ తీసిపారేయకూడదని ఈ సంఘటన రుజువు చేసిందని పోసాని కృష్ణమురళి వివరించారు. 

మీకు నచ్చవచ్చు: బాస్ టీజర్ వచ్చేసింది: ఫ్యాన్స్ లో పూనకాలు!

                               ఆ డైరెక్టర్ తో అడివి శేష్: హీరోయిన్ ఎవరో తెలుసా!

 

 

[Posani Krishna Murali,operation Duryodhana, Tollywood, Ram gopal varma]

                                 


 

google-ad-img