మల్లిగాడితో అల్లరోడి పిల్ల
on Oct 24, 2013
"సీమ టపాకాయ్" చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ పూర్ణకి, తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేకపోయాయి. అయితే తాజాగా ఈ అమ్మడు తెలుగులో మరో చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. సుధీర్ హీరోగా "మాయదారి మల్లిగాడు" పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. ఈ చిత్ర షూటింగ్ ఈ నెల 28వ తేది నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని రేవన్ కుమార్ నిర్మిస్తుండగా హనుమ ముప్పరాజు దర్శకత్వం వహించనున్నారు. మరి ఈ చిత్రంతోనైన పూర్ణ కి మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.