సామ్ తో హ్యాట్రిక్.. మరి పూజ సంగతేంటో!?
on Feb 7, 2022

ఒకే కథానాయికని మళ్ళీ మళ్ళీ తన చిత్రాల్లో నటింపజేయడం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బాణి. దర్శకుడైన కొత్తల్లో ఇలియానాతో `జల్సా`, `జులాయి` సినిమాలు తీశాడు త్రివిక్రమ్. రెండు చిత్రాలు కూడా కాసుల వర్షం కురిపించాయి. అక్కడితో ఇలియానా కాంబో కథ ముగిసింది. ఆపై సమంతని వరుసగా మూడు సినిమాల్లో నాయికగా తీసుకోవడమే కాకుండా, హ్యాట్రిక్ అంకాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు త్రివిక్రమ్. `అత్తారింటికి దారేది`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `అ ఆ` చిత్రాలతో సామ్, త్రివిక్రమ్ కాంబో హ్యాట్రిక్ కొట్టింది. అక్కడితో సమంత కథ కూడా దాదాపుగా ముగిసిపోయినట్టే అనుకోవాలి.
Also Read: 'మహాన్' ట్రైలర్.. తండ్రి పేరు చెడగొడుతున్న కొడుకు!
కట్ చేస్తే.. ఇప్పుడు పూజా హెగ్డే వంతు. మొన్న `అరవింద సమేత వీర రాఘవ`, నిన్న `అల వైకుంఠపురములో`, నేడు `#SSMB 28`.. అన్నట్లుగా ఈ కాంబో సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇప్పటికే `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన త్రివిక్రమ్, పూజ కాంబినేషన్.. `#SSMB 28`తోనూ ఆ పరంపరని కొనసాగిస్తుందా? లేదో? చూడాలి. అలాగే సామ్ తో హ్యాట్రిక్ పూర్తిచేసిన త్రివిక్రమ్.. పూజతోనూ అదే బాట పడతాడా? అన్నది కూడా ఆసక్తికరమే.
Also Read: మెగాస్టార్ లేకుండానే 'గాడ్ ఫాదర్' షూట్.. వెళ్ళిపోతూ కెమెరాకి చిక్కిన నయన్!
కాగా, సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటించనున్న `#SSMB 28` ఏప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



