సహజనటి జయసుధకు కరోనా పాజిటివ్!
on Feb 7, 2022

ఇటీవల పలువురు సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, కీర్తి సురేష్, త్రిష ఇలా ఎందరో కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా సహజనటి జయసుధకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి జయసుధ చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లగా అక్కడ కరోనా బారిన పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది. జయసుధ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
'పండంటి కాపురం' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైన జయసుధ.. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



