జగన్, చిరంజీవి భేటీపై మంచు విష్ణు కామెంట్స్!
on Feb 7, 2022

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల తగ్గింపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు తప్పుబట్టారు. అయితే సీఎం వైఎస్ జగన్ సమీప బంధువులు అయిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ప్రెసిడెంట్ మంచు విష్ణు ఈ అంశంలో ఎందుకు చొరవ తీసుకోవడం లేదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై తాజాగా విష్ణు స్పందించారు. అంతేకాదు, జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అవ్వడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
"ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడంపై కొందరు కోర్టుకు వెళ్లారు. అలాగే తెలంగాణలో టికెట్ రేట్లు పెంచడంపైనా కొందరు కోర్టును ఆశ్రయించారు. రేట్లు తగ్గించడం మంచిదా? పెంచడం మంచిదా అన్నది చాలా పెద్ద విషయం. సమస్య వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంతా ఒక తాటిపైకి వచ్చి గళం విప్పాలి. టికెట్ రేట్ల గురించి ప్రభుత్వంతో చర్చించడానికి ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి ఉన్నాయి. వారు ఏ నిర్ణయం తీసుకుంటే మేం దానికి కట్టుబడి ఉంటాం. వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడకూడదు. ఇటీవల చిరంజీవి గారు జగన్ ని కలిశారు. అది చిరంజీవి వ్యక్తిగత సమావేశం. దానిని అసోసియేషన్ మీటింగ్ గా భావించకూడదు." అని విష్ణు అన్నారు.
ఇటీవల చిరంజీవి సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించామని, జగన్ సానుకూలంగా స్పందించారని ఆ సమయంలో చిరంజీవి చెప్పారు. అంతేకాదు, ఈ నెల 10 న మరోసారి చిరంజీవి జగన్ తో భేటీ కానున్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



