మెగాస్టార్ లేకుండానే 'గాడ్ ఫాదర్' షూట్.. వెళ్ళిపోతూ కెమెరాకి చిక్కిన నయన్!
on Feb 3, 2022

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గాడ్ ఫాదర్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్'కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ పోషించిన పాత్రలో చిరంజీవి నటిస్తుండగా, మంజు వారియర్ పోషించిన పాత్రలో స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తోంది. తాజాగా చిరంజీవి లేకుండా జరిగిన 'గాడ్ ఫాదర్' షూటింగ్ షెడ్యూల్ లో నయనతార పాల్గొంది.
ఇటీవల చిరంజీవి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన లేని సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ లో నయనతార పాల్గొంది. తాజాగా ఆమె షూటింగ్ ముగించుకుని కారులో వెళ్తుండగా కెమెరా కంటపడింది. కారు ముందు సీట్లో కూర్చున్న ఆమె ఫేస్ కి మేకప్ లేకుండా సింపుల్ గా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంది.
కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కీలకపాత్రలో కనిపించనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



