హీరోయిన్ బికినీని వేలంలో కొన్న అభిమాని: పెళ్లి అయ్యే వరకు ఆ విధంగా వేధింపులు!
Nov 24, 2026 6:16PM

ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం.. అనే పదం ఎంత పవిత్రత, త్యాగంతో కూడుకొని ఉందో కదా! కానీ కొంతమంది అభిమానులు హీరోయిన్ పై తమకున్న అభిమానాన్ని చాలా దారుణంగా చూపిస్తూ ఉంటారు.
హీరోయిన్లకి అభిమానులు ఉండటం సహజమే. కొందరు తమ అభిమానాన్ని పూలు, బహుమతుల రూపంలో చూపిస్తే.. మరికొందరు మాత్రం హద్దులు దాటేస్తుంటారు. అలాంటి ఓ వింత అనుభవాన్ని బాలీవుడ్ నటి పూజా బేడీ తాజాగా మరోసారి గుర్తుచేసుకున్నారు. 1993లో ఆమె ఓ సినిమాలో ధరించిన బికినీ వేలంలో అమ్ముడుపోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. అయితే దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ఆ తర్వాత చేసిన పనులు మాత్రం పూజా బేడీని చాలా కాలం పాటు ఇబ్బందులకు గురిచేశాయి.
పూజా బేడీ 1993లో విడుదలైన ‘లుటేరే’ సినిమాలో బికినీ ధరించింది. అదే బికినీని 1993 మే నెలలో ముంబైలో నిర్వహించిన ‘ఫరెవర్ యువర్స్’ అనే వేలం కార్యక్రమంలో ఉంచారు. సెలబ్రిటీలు ఉపయోగించిన దుస్తులు, వస్తువులను వేలం వేసిన ఈ కార్యక్రమానికి నటి అర్చన పూరన్ సింగ్ హోస్ట్‌గా వ్యవహరించారు.

ఈ వేలంలో పూజా బేడీ బికినీని ఓ అభిమాని ఏకంగా రూ.1500 పెట్టి కొనుగోలు చేశాడు. అయితే అతను ఆ బికినీని కొనడంతో కథ ముగిసిపోలేదు. అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. అంతేకాదు.. తరచూ ఫోన్లు చేయడం, రక్తంతో లేఖలు రాసి పంపడం వంటి పనులు చేసేవాడట. ఒకరోజు వేలంలో కొనుగోలు చేసిన బికినీని తీసుకుని ఏకంగా పూజా బేడీ ఇంటికే వచ్చేశాడట. అతడి ప్రవర్తనతో ఆమె తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
ఇది కూడా చదవండి: సీన్ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్: ఆ డేట్ కి ఉన్న స్పెషల్ ఇదే!
ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, అతడి వేధింపులు మాత్రం ఆగలేదని పూజా బేడీ గుర్తుచేసుకున్నారు. తనకు ఆమెను కౌగిలించుకునే అవకాశం లేకపోతే, ఆమె బికినీని అయినా కౌగిలించుకుంటానని ఆ వ్యక్తి చెప్పినట్లు ఆమె వెల్లడించారు. తన పెళ్లి అయ్యే వరకు ఆ వ్యక్తి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు.
సెలబ్రిటీలపై అభిమానం ఉండటం వేరు.. వారి వ్యక్తిగత జీవితంలోకి చొరబడి వేధించడం వేరు. అభిమానమనే పేరుతో హద్దులు దాటితే అది ఎంత ఇబ్బందికరంగా మారుతుందో పూజా బేడీకి ఎదురైన ఈ పాత అనుభవమే చెబుతోంది. పూజా బేడీ గతంలో ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్నప్పుడు ఈ ఘటన గురించి వివరించారు.
.webp)
ఆ అభిమాని తనపై విపరీతమైన అభిమానం పెంచుకున్నాడని, ఆమెకు ఇష్టమైన ‘అనైస్-అనైస్’ పర్ఫ్యూమ్ పేరునే తన పేరుగా పెట్టుకున్నాడని కూడా ఆమె వెల్లడించింది. అందుకే అంటారు మితిమీరిన ప్రేమ, అభిమానం ఎవరకి మనశ్శాంతిని ఇవ్వదు. కూరలో వేసుకునే ఉప్పు, కారం లాగా సమపాళ్లల్లో ఉండాలి.
మీకు నచ్చవచ్చు
ఫోక్సో కేసులో ప్రముఖ నటుడికి జైలు శిక్ష!
భోగి ఫస్ట్ రివ్యూ: ఇన్ని ట్విస్ట్ లా!
[Pooja Bedi, Film Bikini, Fan, Tollywood]



