
హీరోయిన్... అభిమానులు,ప్రేక్షకుల దృష్టిలో స్వర్గ లోకం నుంచి దిగొచ్చిన దేవత. మేకర్స్ తనపై పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టు క్యారక్టర్ కోసం రొమాంటిక్ గా కనిపిస్తుంది. ఫంక్షన్స్ లో కూడా తనకి నచ్చిన విధంగా బట్టలు ధరిస్తూ ఉంటుంది. కానీ ఇటీవల కొంత మంది సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ల శరీరాకృతిని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం, వారి ఫొటోలు, వీడియోలని వైరల్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ హద్దులు దాటుతున్నారనేది కూడా నిజం.
తాజాగా ఇలాంటి బాడీ షేమింగ్‌పై టాలీవుడ్ హీరోయిన్ ఘాటుగా స్పందించింది. తన శరీరం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వీడియోలను వైరల్ చేస్తున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నా శరీరం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఆ హీరోయిన్ ఎవరో కాదు. పాయల్ రాజ్‌పుత్. ఎక్స్ వేదికగా తను స్పందిస్తూ 'మీకు సిగ్గుండాలి. నా శరీరం గురించి అసహ్యకరమైన కామెంట్లు చేస్తూ, ఆ వీడియోలని షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ సిగ్గుండాలి. నా శరీరం, నా సైజ్, నా గర్వం. ఇవి మీ చర్చలకు, మీ అభిప్రాయాలకు లేదా మీ అశ్లీలతకు సంబంధించిన విషయాలు కావు. మీ పరిధిలో మీరు ఉండండి, మీ పని మీరు చూసుకోండి” అని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Tiger Shroff: టైగర్ ష్రాఫ్ పై కాల్పులు జరిపింది వీళ్ళే: ఇద్దరు మహిళలు, ఒక మైనర్ బాలిక!
.webp)
పాయల్ రాజ్‌పుత్ సినీ జర్నీ గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఆర్ ఎక్స్ 100 , మంగళవారం తో అభిమానుల హార్ట్ బీట్ గా మారింది. నిత్యం ఈ రెండు సినిమాలు చూస్తూ ఉండే వాళ్ళ నంబర్స్ ని కౌంట్ చెయ్యడం కూడా కష్టం. తన కొత్త సినిమా కోసం వెయిటింగ్. ఇక పాయల్ చెప్పినట్టుగా తన బట్టలు, తన శరీరం తన ఇష్టమని అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
[Payal Rajput Hit back strongly at online trolls who body shamed her, Payal Rajput latest tweet, payal Rajput latest News]






