పవన్ తాట తీస్తానన్నది ఎవరిని?
on Oct 17, 2013
పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలై సూపర్ హిట్ అవడమే గాక బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. అయితే ఈ చిత్ర విజయంపై అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడానికి హైదరబాదులో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన సినిమాను పైరసీ చేసిన వారిని తీవ్రంగా హెచ్చరించారు. అయితే ఆ పైరసీ చేసింది మరెవరో కాదు అని పవన్ అనడంపై అన్నింటా హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.... "సహిస్తాం, పడతాం, భరిస్తాం..ఇక తప్పదు అనే స్థాయికి వస్తే మాత్రం చివరికి వాళ్ళ తాట తీస్తాం.." అంటూ పవన్ బహిరంగంగా హెచ్చరించారు.అయితే ఇదంతా కేవలం తన కుటుంబ పెద్ద మనిషిపైనే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. చరణ్ నటించిన "ఎవడు" చిత్రం విడుదలై మంచి టాక్ సంపాదించుకోవాలంటే పవన్ సినిమా ఫెయిల్ కావాల్సిందేననే ఉద్దేశ్యంతో నేరుగా తన వాళ్ళే పైరసీ చేసారని సమాచారం. అయితే ఎప్పుడు తన చిరంజీవిని అన్నయ్య అంటూ పిలిచే పవన్.. ఈ వేడుకలో చిరంజీవి అని సంబోధించడంపై ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. నేరుగా వాళ్ళని ఏం అనలేకనే పవన్ ఈ విధంగా తీవ్రంగా హెచ్చరించారని వారి సన్నిహితుల అభిప్రాయం.