Home

»

Latest News

ఉగాదికి "గబ్బర్ సింగ్" ట్రైలర్ విడుదల

Jan 31, 2012

ఉగాదికి "గబ్బర్ సింగ్" ట్రైలర్ విడుదల కానుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా, హరీష్ శంకర్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రం"గబ్బర్ సింగ్ ". "ఈ సినిమా గనక హిట్ కాకపోతే నన్ను చంపండి" అని కూడా ఈ చిత్ర నిర్మాత గణేష్ పవన్ కళ్యాణ్ అభిమానులకు హామీ ఇచ్చాడు.

ఈ "గబ్బర్ సింగ్" ట్రైలర్ రానున్న ఉగాది పర్వదినం కానుకగా, ఫిబ్రవరి 20 వ తేదీన విడుదల కానున్నాయని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. హిందీలో సల్మాన్ ఖాన్, సోనాక్షీ సిన్హా జంటగా నటించగా సూపర్ హిట్టయిన "దబాంగ్" చిత్రం ఈ "గబ్బర్ సింగ్ " చిత్రానికి మాతృక అన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com