
కొన్ని చిత్రాలు అంతే కాన్సెప్ట్ తోనే తమ వైపు చూసేలా చేసుకుంటాయి. అలాంటి ఒక చిత్రమే 'పారివారిక మనోరంజన్'. అంత వెరైటీ ఏముందని అనుకోకండి. 50 ఏళ్ల వ్యక్తితో ఓ యువతి లవ్‌లో పడితే... ఇదే కాన్సెప్ట్. అంటే ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ.
కారణాలు తెలియదు గాని థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం డైరెక్ట్‌గా 'సోనీ లివ్' (Sonyliv) ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తారు. తాజాగా నిన్న రిలీజ్ చేసిన టీజర్ ట్రెండ్ అవుతోంది. సినిమా టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. రంజన్ దూబే (పంకజ్ త్రిపాఠీ) అనే వ్యక్తి ఇంట్లోకి ప్రాపర్టీ మేనేజర్ అండ్ హౌస్ కీపర్‌గా వస్తుంది హెలెన్ (అదితీ రావ్ హైదరీ). ఢిల్లీ నుంచి వచ్చిన ఈ అమ్మాయి దూబేను ఎందుకు ఇష్టపడింది? ఆ తర్వాత వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: ఉపాసన సంచలన వ్యాఖ్యలు: ఆ ఆడవాళ్లు ఎవరు!

వరుణ్ వి. శర్మ దర్శకుడు కాగాప్రేక్షకులు కోరుకునే స్వచ్ఛమైన ప్రేమ, పరిమళించే హాస్యం, కుటుంబ బంధాల భావోద్వేగాల సమ్మేళనంతో మూవీ సాగబోతునట్టుగా తెలుస్తుంది.బ్రజేంద్ర కాల, అలీ అబ్బాస్ జాఫర్ వరుణ్ వి. శర్మ సంయుక్తంగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించారు.
[Parivarik Manuranjan Ott Release Date, Parivarik ManuRanjan, Pankaj Tripathi OTT movie, Aditi Rao Hydari new film, Sony LIV direct release, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]





