పూరి హార్ట్ కి చిల్లు... మంచు తుమ్మెద గొల్లు
Jan 31, 2014 12:34PM

నేడు పూరి దర్శకత్వంలో తెరకెక్కిన "హార్ట్ ఎటాక్"తో పాటుగా "పాండవులు పాండవులు తుమ్మెద" సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాల గురించి వచ్చిన టాక్ ప్రకారం పూరి "హార్ట్ ఎటాక్" సినిమా కంటే మంచు వారి "పాండవుల.." కామెడియే బాగా నచ్చిందని అంటున్నారు.

లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "హార్ట్ ఎటాక్" యావరేజ్ గా ఉందని, యూత్ ని కూడా అంతగా ఆకట్టుకోవట్లేదని అనుకుంటున్నారు. మంచు వారి "పాండవుల.." అల్లరి మాత్రం బాగా నచ్చిందని, కుటుంబ సభ్యులతో కలిసి చూడవచ్చని చెబుతున్నారు. మరి కలెక్షన్ల పరంగా ఏ చిత్రం ఎంత వసూలు చేస్తుందో త్వరలోనే తెలియనుంది.




