TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

కొత్త సంవత్సరం, పాత సినిమాలు.. క్యూ కడుతున్న హీరోలు!

Dec 26, 2024 2:10PM

న్యూ ఇయర్‌ వస్తోందంటే.. అందరూ సెలబ్రేషన్‌ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కొత్త సంవత్సరం సరికొత్త సినిమాల రిలీజ్‌ కోసం చూస్తుంటారు. ఆ వెంటనే సంక్రాంతి పండగ వస్తోంది. ఆ సందర్భంగా రిలీజ్‌ అయ్యే సినిమాల కోసం ప్రేక్షకుల్లో హడావిడి మొదలైపోతుంది. మరి కొత్త సంవత్సం పాత సినిమాలు ఏమిటి? అని అందరికీ అనిపించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా జనవరి 1న కొన్ని సినిమాలను రీరిలీజ్‌ చేసే ఆనవాయితీ నడుస్తోంది. దాన్ని ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేసేందుకు రంగం సిద్ధమైంది. రీరిలీజ్‌ అనగానే ఆ సినిమాలోని హీరోకి సంబంధించిన ఫ్యాన్స్‌ నానా హంగామా చేస్తుంటారు. ఇక న్యూ ఇయర్‌ రోజు రిలీజ్‌ అంటే అది మామూలుగా ఉండదు. 

ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మూడు సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. వరస ఫ్లాపుల్లో ఉన్న మెగాస్టార్‌ చిరంజీవికి కొత్త ఊపిరినిచ్చిన సినిమా ‘హిట్లర్‌’. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సినిమాను జనవరి 1న విడుదల చేయబోతున్నారు. ఇక కొత్త ఏడాది 2025కి స్వాగతం పలుకుతూ హీరో నితిన్‌ తనకి ఎంతో పేరు తెచ్చిన ‘సై’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటి యూత్‌ ఎంజాయ్‌ చెయ్యదగ్గ అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. మరో సినిమా సిద్ధార్థ్‌, షామిలి జంటగా రూపొందిన ‘ఓయ్‌’ చిత్రం కూడా రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమా ఇంతకుముందే రీరిలీజ్‌ మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ప్రస్తుతానికి కొత్త సంవత్సరంలో రిలీజ్‌ అయ్యే భారీ సినిమాలు ఏమీ లేవు. ఆ స్థానంలో పాత సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. 

google-ad-img