త్వరలోనే ఓటీటీలోకి 'ఒకే ఒక జీవితం'!
on Sep 26, 2022
చాలా రోజుల తర్వాత 'ఒకే ఒక జీవితం' రూపంలో మంచి విజయాన్ని అందుకున్నాడు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తల్లీకొడుకుల బంధం నేపథ్యంలో తెరకెక్కిన 'ఒకే ఒక జీవితం' ప్రేక్షకులను మెప్పించింది. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ కలగలిసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్న ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ఏకంగా రూ.15 కోట్లకు సోనీ లివ్ దక్కించుకుందట. థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో ప్రదర్శించేలా డీల్ కుదుర్చుకున్న సోనీ.. అక్టోబర్ రెండో వారంలో స్ట్రీమ్ చేయడానికి సన్నాహాలు చేస్తుందట. అక్టోబర్ 9 తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా శర్వా తల్లి పాత్రలో అక్కినేని అమల నటించారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జేక్స్ బెజాయ్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ సారంగ్, ఎడిటర్ గా శ్రీజిత్ సారంగ్ వర్క్ చేశారు.
Also Read