ఒక బృందావనం మూవీ రివ్యూ
on May 24, 2025
సినిమా పేరు: ఒక బృందావనం
తారాగణం: బాలు, షిన్నోవా, సాన్విత, శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూపాలక్ష్మి, మహేందర్, వంశీ తదితరులు
మ్యూజిక్ : సన్నీ, సాకేత్
ఫొటోగ్రఫీ: రాజ్ కె నల్లి
ఎడిటర్: తమ్మిరాజు, సంతోష్ కామిరెడ్డి
దర్శకత్వం: సత్య బొత్స
నిర్మాతలు: కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు
బ్యానర్ :సీర్ స్టూడియోస్
రిలీజ్: మైత్రి మూవీస్
విడుదల తేదీ: మే 23 ,2025
నూతన నటీనటులు, పాతతరం నటీనటుల కలయికలో తెరకెక్కిన 'ఒక బృందావనం'(Oka Brundavanam)మూవీ ఈ రోజు థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. ట్రైలర్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ ని కూడా కలిగించిన ఈ మూవీ మరి ఎలా ఉందో చూద్దాం.
కథ
మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాజా విక్రమ్(బాలు) కెమెరామెన్ గా ఒక ఈవెంట్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. బాగా డబ్బు సంపాదించాలనే కోరికతో అమెరికా వెళ్లాలనే గోల్ తో ఉంటాడు. కోటీశ్వరరాలైన మహి(షిన్నోవా) కి ఇంట్లో వాళ్ళు పెళ్లి చెయ్యాలని చూస్తుంటారు. కానీ చనిపోయిన తన తల్లి చేయాలనుకున్న ఒక డాక్యుమెంటరీని చిత్రీకరించడం కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సుమారు ఎనిమిది సంవత్సరాల వయసు గల నైనికా(సాన్విత) అనే పాప అనాథాశ్రమంలో అనాధగా ఉంటుంది. ప్రతి క్రిస్మస్ పండుగకి జోసెఫ్(శుభలేఖ సుధాకర్) పేరు మీద నైనికాకి గిఫ్ట్స్ వస్తుంటాయి. కానీ ఆ జోసఫ్ ఎవరో నైనికా కి తెలియదు. గర్ల్ ఫ్రెండ్ వేరే పెళ్లి చేసుకోవడంతో దిగుల్లో ఉన్న రాజాని తన డాక్యుమెంటరీ కి కెమెరామెన్ గా చేయమని మహి అడుగుతుంది. డబ్బు వస్తుందన్న ఆశతో ఓకే చెప్తాడు. ఈ క్రమంలో నైనిక ని కలుస్తారు. జోసెఫ్ వద్దకు తీసుకువెళ్తామని చెప్పడంతో డాక్యుమెంటరీ వీడియోలో చేయడానికి నైనికా ఒప్పుకుంటుంది. రాజా, మహి తమ డాక్యుమెంటరీ కి నైనికా నే ఎందుకు ఎంచుకున్నారు? మహి తన తల్లి లక్ష్యాన్ని నెరవేర్చిందా? అసలు డాక్యుమెంటరీ ఏ అంశంపై చిత్రీకరించారు? రాజ్ అమెరికా ప్రయాణం ఏమైంది? జోసెఫ్ ఎవరు? నైనికాకే ఎందుకు గిఫ్ట్స్ పంపిస్తున్నాడు? నైనికా తల్లి తండ్రి ఉన్నారా? రాజా,మహి మధ్య ఆ ప్రయాణంలో ప్రేమ పుట్టిందా? అసలు ఈ కథ యొక్క లక్ష్యం ఏంటనేదే ఈ చిత్ర కథ
ఎనాలసిస్
'ఒక బృందావనం' అనే టైటిల్ కి తగ్గట్టే సినిమా ఆసాంతం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఒక ఫీల్ గుడ్ సినిమాకి ఎటువంటి కథ కావాలో కూడా ఏ సినిమా చెప్పింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే రాజా,మహి,నైనిక పాత్రల పరిచయం, ఆ ముగ్గురు కలవడానికి ఏర్పడిన సీన్స్ అన్ని బాగున్నాయి. రాజా వేరే అమ్మాయితో బ్రేక్ అప్ జరిగిన సీన్స్ కూడా బాగున్నాయి. కాకపోతే రాజా వెనక మహి డాక్యుమెంటరీ కోసం తిరగడం, డాక్యుమెంటరీ షూటింగ్
కథ కాస్త నిదానంగా సాగింది. లవ్ సీన్స్ మాత్రం రెగ్యులర్ సినిమాల్లో చేసినట్టుగానే అనిపిస్తాయి.ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం చాలా బాగుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక సెకండ్ హాఫ్ లో జోసెఫ్ ని వెతుక్కుంటూ రాజా, మహి, నైనిక ప్రయాణంలో వచ్చిన సీన్స్ అన్ని కూడా బాగున్నాయి. చాలా నాచురల్ గా కూడా ఉండి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగించాయి. ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు ప్రీ క్లైమాక్స్ లో వచ్చిన లవ్ ఎమోషన్ బాగా పండింది.కొన్ని భావోద్వేగ సన్నివేశాలు అయితే కళ్ళ వెంట నీళ్లు కూడా తెప్పించాయి. కేరళ డైలాగ్స్ వచ్చినప్పుడు తెలుగు సబ్ టైటిల్స్ వేస్తే బాగుండేది.
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
రాజా విక్రమ్ క్యారక్టర్ లో బాలు(Balu)అత్యద్భుతంగా నటించాడు. కొత్త నటుడు అయినా రాజా విక్రమ్ క్యారక్టర్ తన కోసమే పుట్టిందేమో అనేలా ఎంతో ఎనర్జీ తో నటించాడు. తెలుగు పరిశమ్రకి ఇంకో మంచి హీరో దొరికినట్టే. హీరోయిన్ గా చేసిన షిన్నోవా(Shinnova Soni)తన క్యారక్టర్ ద్వారా ఇండిపెండెంట్ గా ఆలోచించే నేటి తరం ఎంతో మంది అమ్మాయిలని మన ముందు ఉంచింది. లవ్ అండ్ సెంటిమెంట్ సీన్స్ లో కూడా ఎక్స్ లెంట్ పెర్ఫార్మ్. సాన్విత గా చేసిన పాప ఎంతో మెచ్యూర్డ్ గా నటించి తన క్యారక్టర్ కి వన్నె తీసుకొచ్చింది. మిగతా పాత్రలో చేసిన శుభలేఖ సుధాకర్, శివాజీ రాజా, మహేంద్ర తో పాటు మిగతా నటీ నటులందరు తమ పాత్ర పరిధి మేరకు నటించి సినిమాకి నిండు తనాన్ని తీసుకొచ్చారు. దర్శకత్వంతో పాటు ఫొటోగ్రఫీ, సంగీతం, నిర్మాణ విలువలు కూడా హైలెట్ గా ఉండటంతో పాటు కొన్ని డైలాగ్స్ ఆలోచించే విధంగా ఉన్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే మూవీ అక్కడక్కడ కొద్దిగా స్లో గా సాగినా కూడా పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. ఫ్యామిలీ తో పాటు ఎంజాయ్ చేసే మంచి ఫీల్ గుడ్ మూవీ.
రేటింగ్ 2.75/5

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
