TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

రీ రిలీజ్ ట్రెండ్ లో భూమికాదే పై చేయి!

Jan 27, 2023 8:41AM

 ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్  నడుస్తోంది. ఇప్పటికే ఖుషి, తొలిప్రేమ, తమ్ముడు, మహేష్ బాబు ఒక్కడు, జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి వంటి చిత్రాలన్నీ ఫోర్ కే లో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాయి. రాజమౌళి ఎన్టీఆర్ ల కాంబినేషన్‌లో వచ్చిన సింహాద్రి చిత్రాన్నిమే 20వ తేదీన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే కానుక‌గా  రీ రిలీజ్  చేయ‌నున్నారు. ఇలా ఖుషి, ఒక్కడు త్వరలో రానున్న  సింహాద్రి చిత్రాలన్నింటిలో భూమికనే హీరోయిన్ అన్నది గమనించాల్సిన విషయం. మొత్తంగా ఈ మూడు రీరిలీజ్  మూవీలలో భూమిక హీరోయిన్ కావడం ప్రస్తుతం హాట్  టాపిక్ గా మారింది. ఆ ఘనత సాధించడం భూమికాకు మాత్రమే సాధ్యమైందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒక హీరోయిన్ కి సంబంధించిన మూడు సినిమాలు రీ రిలీజ్  కావడం సినీ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఆ ఫేట్ భూమికకు మాత్రమే సాధ్యమైంది. 4k  వెర్ష‌న్స్ లో వ‌స్తున్న ఈ  మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓ విధంగా చెప్పాలంటే తారక్ కి ఈ మూవీనే  స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చింది. స్టూడెంట్ నెంబర్ 1, ఆది తరువాత ఆయన రేంజ్ ని పెంచిన చిత్రంగా సింహాద్రిని చెప్పుకోవచ్చు. ఇది రాజమౌళి తారక్ ల  కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా. ఓ విధంగా చెప్పాలంటే రాజమౌళికి కూడా ఈ సినిమా కమర్షియల్ డైరెక్టర్ అనే బ్రాండ్ ను  తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

google-ad-img