
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని గతంలో నిర్మాత నాగవంశీ ప్రకటించారు. 'జైలర్ 2' విడుదలైన సందర్భంగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మరోసారి చర్చ జరుగుతోంది.
'జైలర్ 2'ను తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తెలుగునాట కూడా మంచి వసూళ్లు సాధిస్తుండటంతో తాజాగా నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి తన సంతోషాన్ని పంచుకున్నారు. అంతేకాదు 'జైలర్ 2' దర్శకుడు నెల్సన్ తో తమ బ్యానర్ లో సినిమా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.
నాగవంశీ మాట్లాడుతూ.. "జైలర్ 2 భారీ రేటుకి పెట్టి కొన్నప్పుడు అందరూ రిస్క్ అన్నారు. కానీ, రిలీజ్ రోజు సాయంత్రం నుంచే భారీ వసూళ్లు వస్తున్నాయి. మేము నమ్మి రిస్క్ చేసినందుకు, మా ప్రతిఫలం దక్కుతోంది. అయినా నెల్సన్ గారితో మేము సమీప భవిష్యత్తులో సినిమా చేయబోతున్నాం. ఆయనతో సినిమానే చేయబోతున్నప్పుడు, ఆయన సినిమా డిస్ట్రిబ్యూషన్ కోసం ఈ మాత్రం రిస్క్ చేయలేమా?" అన్నారు.
నాగవంశీ మాటలను బట్టి చూస్తే.. త్వరలోనే సితార బ్యానర్ లో నెల్సన్ సినిమా ఉంటుందని అర్థమవుతోంది. ఇక అది ఎన్టీఆర్ తోనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో 'గాడ్ ఆఫ్ వార్' లైన్ లో ఉంది. 'గాడ్ ఆఫ్ వార్' స్టార్ట్ అయ్యే దానిని బట్టి, నెల్సన్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తామని నాగవంశీ చెప్పారు.
'గాడ్ ఆఫ్ వార్' అనేది భారీ బడ్జెట్ తో కూడిన మైథాజికల్ ప్రాజెక్ట్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే చాలా సమయం పడుతుంది. అందుకే డ్రాగన్ పూర్తయ్యాక.. 'గాడ్ ఆఫ్ వార్'కి ముందు ఎన్టీఆర్ నెల్సన్ ప్రాజెక్ట్ చేసినా ఆశ్చర్యంలేదు.
ఇది కూడా చదవండి: చెప్పిన డేట్కు రాకపోతే ఎలా.. ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్పై నాగార్జున పంచ్.!
[NTR Nelson Movie Latest Update, Jr NTR Nelson Movie, Jailer 2 Movie Telugu, Producer Naga Vamsi, NTR Dragon, God Of War, NTR Trivikram, NTR Neel, Telugu Film News]






