TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న హీరోయిన్ ఆమె కాదు!

May 15, 2020 10:12AM

 

'గ‌బ్బ‌ర్‌సింగ్' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొంద‌నున్న‌ది. ఇది ప‌వ‌న్‌కు 28వ చిత్రం. ప్ర‌చారంలో ఉన్న దాని ప్ర‌కారం దేవి శ్రీ‌ప్ర‌సాద్ ఈ మూవీకి బాణీలు స‌మ‌కూర్చ‌నున్నాడు. ఈ సినిమాపై ఇప్ప‌టికే అనేక వ‌దంతులు ప్ర‌చారంలో ఉన్నాయి. ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌య‌మై సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ప‌వ‌న్‌ను 'గ‌బ్బ‌ర్‌సింగ్‌'గా హ‌రీశ్ శంక‌ర్ ప్రెజెంట్ చేసిన విధానం ఫ్యాన్స్‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసింది. అందుకే ఈ కాంబినేష‌న్‌లో వ‌చ్చే మూవీకి సంబంధించిన అధికారిక స‌మాచారం కోసం వారు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

ఈ మూవీలో పీకే జోడీగా మ‌ల‌యాళం యంగ్ యాక్ట్రెస్ మాన‌స రాధాకృష్ణ‌న్‌ను హ‌రీశ్ ఎంపిక చేశాడ‌నీ, సినిమాకు 'ఇప్పుడే మొద‌లైంది' అనే టైటిల్ పెట్టార‌నీ.. ఇలా ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో త‌ను చేయ‌బోతున్న సినిమా గురించి మాట్లాడాడు హ‌రీశ్ శంక‌ర్‌. హీరోయిన్‌గా మాన‌స‌ను ఎంపిక చేశామ‌నే ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించాడు. అంతేకాదు, సినిమా టైటిల్‌ను ఇంకా నిర్ణ‌యించ‌లేద‌నీ, నిర్ణ‌యించాక ప్ర‌క‌టిస్తామ‌నీ ఆయ‌న తెలిపాడు.

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యానికి వ‌స్తే, 'అజ్ఞాత‌వాసి' త‌ర్వాత రెండేళ్ల‌పాటు పూర్తిగా రాజ‌కీయాల్లో దృష్టి పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఇప్పుడు 'వ‌కీల్ సాబ్' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్, తాప్పీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా 2016లో వ‌చ్చిన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్' రీమేక్‌గా ఈ సినిమా త‌యార‌వుతోంది. 'వ‌కీల్ సాబ్' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ‌య్యాక పీకే ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టైటిల్ రోల్‌లో పీకే అదిరిపోయార‌ని సోష‌ల్ మీడియా వ్యాప్తంగా వ‌చ్చిన స్పంద‌న తెలియ‌జేసింది.

google-ad-img