Home

»

Latest News

'స్వయంభు' పై నిఖిల్ ఎమోషనల్ పోస్ట్: ఫ్యాన్స్ భావోద్వేగం! 

Oct 26, 2026 12:38PM


కార్తికేయ 2 తో పాన్ ఇండియా కట్ అవుట్ గా మారడనేది నిజం. ఇప్పుడు ఆ నిజాన్ని శాశ్వతం చెయ్యాలని పీరియాడిక్ మూవీ 'స్వయంభు' తో రెడీ అవుతున్నాడు. ఒక రకంగా తన కలల ప్రాజెక్ట్ కూడా. ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలతో అయితే స్వయంభు రేంజ్, క్వాలిటీ అర్థమవుతూనే ఉంది. కాకపోతే కొన్ని రోజుల నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో అభిమానుల పెయిన్ ని అర్ధం చేసుకున్నాడో ఏమో నిఖిల్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు.


తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ' స్వయంభు గ్రాఫిక్స్  వీఎఫ్‌ఎక్స్ పనులకి  సంబంధించిన తాజా పరిణామాలు సినిమా స్థాయిని మరింత పెంచేశాయి.   సినిమాకు అత్యంత కీలకమైన మరియు హై-ఎండ్ వీఎఫ్‌ఎక్స్ (VFX) షాట్స్‌ను తాను తాజాగా పరిశీలించానని, ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ స్టూడియో అయిన 'ఫాంటమ్ ఎఫ్ఎక్స్' (Phantom FX) ఈ సినిమా కోసం అసాధారణమైన అవుట్‌పుట్‌ను తీసుకువచ్చింది. ఆ విజువల్స్ చూసిన క్షణంలో  మైండ్ బ్లాంక్ అయిపోయిందని, ఆశ్చర్యంతో మాటలు కూడా రావడం లేదు.ఇంతటి బ్రహ్మాండమైన చారిత్రాత్మక నేపథ్యంలో సాగే చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూస్తానా అని   అస్సలు ఆగలేకపోతున్నాను.. థియేటర్లలో ప్రేక్షకులకి  ఒక సరికొత్త దృశ్యకావ్యం, నూతన అనుభూతిని పంచే విజువల్ ట్రీట్ ఖచ్చితంగా తగలనుందని నిఖిల్ ఎక్స్ వేదికగా తెలిపాడు.


ఇది కూడా చదవండి: ధూమ్ 4 లో మహేష్ బాబు: ఆ రోల్ ఇదేనా!

 

 


ఆ ట్వీట్ ని బట్టి స్వయంభులో గ్రాఫిక్స్  విజువల్ ఎఫెక్ట్స్ ఇంపార్టెన్స్ ని అర్ధం చేసుకోవచ్చు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్వయంభుని ఠాగూర్ మధు నిర్మిస్తుండగా సంయుక్త మీనన్, నభా నటాష్ హీరోయిన్స్.

 

 

[Nikhil Latest Tweet About Swayambhu, swayambhu vfx update, Nikhil Siddhartha About swayambhu, Swayambhu movie, Nikhil Siddhartha, Phantom FX, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com