నిహారిక కాబోయే వరుడు ఇతడే!
Jun 19, 2020 11:02AM

నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల వివాహం హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చైతన్య జొన్నలగడ్డతో నిశ్చయమైంది. బిట్స్ పిలానిలో చైతన్య చదువుకున్నాడు. అతను గుంటూరు రేంజి ఐజీ జె. ప్రభాకరరావు కుమారుడు. చైతన్య హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. ఫిల్మ్‌నగర్‌లో ఉన్న భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్నాడు. ఆ తర్వాత బిట్స్‌లో మేథమేటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేశాడు.
గురువారం మిసెస్ నిహాని కాబోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆ తర్వాత మొహం కనిపించకుండా తన కాబోయే వరుడిని పరిచయం చేస్తూ, అతడిని కౌగలించుకొని ఉన్న పిక్చర్‌ను షేర్ చేసింది. ఆ మిస్టరీ మేన్ చైతన్య జొన్నలగడ్డ అని శుక్రవారం స్పష్టమైంది. తన మిగతా జీవితాన్ని గడపడానికి అతను తగినవాడిగా గుర్తించినట్లు నిహారిక చెప్పింది. అయితే అధికారికంగా నిశ్చితార్ధం జరగలేదని ఆమె తెలిపింది. ఆగస్ట్‌లో వారి నిశ్చితార్ధం జరగనున్నట్లు సమాచారం.

మెగా అల్లుడి ఫాలోయింగ్ పెరుగుతోంది!
మెగా ఫ్యామిలీకి కాబోయే కొత్త అల్లుడి పేరు చైతన్య అని తెలుగువన్ డాట్ కామ్ చెప్పింది. చైతన్యతో దిగిన క్లోజ్ ఫోటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కాబోయే భర్త ఐడీని ట్యాగ్ చేశారు. దాంతో ఇన్‌స్టంట్‌గా చైతన్య ఫాలోయింగ్ 30 వేలకు పెరిగింది. గురువారం సాయంత్రం వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అతడి అకౌంట్ ప్రయివేట్ మోడ్‌లో ఉంది. ఇప్పుడు పబ్లిక్ మోడ్‌లోకి ఆన్ చేశారు. గురువారం వరకు అతడిని ఇన్‌స్టాలో ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య 2000 కూడా లేరు. ఇప్పుడు 30 వేలు దాటింది. గంట గంటకు పెరుగుతోంది. మెగా ఇంటికి కాబోయే అల్లుడు కావడంతో మెగాభిమానులు, ప్రేక్షకులు ఫాలో అవుతున్నారు. అదీ సంగతి..





