Home

»

Latest News

Jr NTR: ఎన్టీఆర్ లాంటి హీరోను చూడలేదు.. నయనతార సెన్సేషనల్ కామెంట్స్!

Apr 27, 2026 11:06AM

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇటీవల మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా నయనతార బయటి వేదికలపై తక్కువగా కనిపిస్తుంటారు, అలాగే సహ నటుల గురించి మాట్లాడటం కూడా అరుదు. అయితే తారక్ విషయంలో ఆమె ప్రశంసల వర్షం కురిపించడం నందమూరి అభిమానులను ఖుషీ చేస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్, నయనతార గతంలో 'అదుర్స్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సెట్స్‌లో తారక్ పనితీరును చూసి తాను ఎంతగా ఆశ్చర్యపోయానో ఒక ఇంటర్వ్యూలో నయన్ గుర్తు చేసుకున్నారు. "నేను నా కెరీర్‌లో చాలా మంది స్టార్ హీరోలతో పని చేశాను. కానీ తారక్ స్టైల్ వేరు. ఆయన సెట్స్‌లోకి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ముఖ్యంగా ఆయన మెమరీ పవర్ చూసి నేను షాక్ అయ్యాను" అని నయనతార పేర్కొన్నారు.

ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి నయనతార ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'అదుర్స్' సినిమాలో పాటల చిత్రీకరణ సమయంలో తారక్ ఎంతో కష్టమైన స్టెప్పులను కూడా కేవలం ఒక్కసారి చూడగానే అలవోకగా వేసేవారని ఆమె చెప్పారు. "మేము ఆ స్టెప్పుల కోసం గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తే, ఆయన మాత్రం రిహార్సల్స్ లేకుండానే సింగిల్ టేక్‌లో ఓకే చేసేవారు. షూటింగ్ గ్యాప్‌లో అందరితో ఎంతో సరదాగా ఉంటూనే, కెమెరా ముందుకు రాగానే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. అలాంటి టాలెంట్ ఉన్న నటుడిని నేను ఇంతవరకు చూడలేదు" అని నయన్ కొనియాడారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com