ఈనెల 13న ప్రతినిధి పాటలు
on Nov 11, 2013

నారా రోహిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "ప్రతినిధి". ఈ చిత్ర ఆడియోను ఈనెల 13న విడుదల చేయనున్నారు. సుధా సినిమాస్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ప్రశాంత్ మాండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రంలో శుబ్ర అయ్యప్ప హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



