TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

నారా రోహిత్ చేసుకోబోయే శిరీష ఎవరు..ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య 

Oct 14, 2024 11:48AM

బాణంతో సినీ అరంగ్రేటం చేసిన నారా రోహిత్(nara rohit)రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్స్ కి ముందు ప్రజల్లో చైతన్యాన్ని నింపేలా ప్రతినిధి 2(prathinidhi 2)అనే మూవీ చేసాడు.రీసెంట్ గా  ప్రతినిది 2 లోనే తనతో జోడి కట్టిన సిరి లెల్లా(siri lella)తో ఏడడుగులు కలిసి నడవడానికి సిద్ధమవ్వబోతున్నాడు.

దీంతో ఇప్పుడు సినీ ప్రేక్షకులతో పాటు ప్రజల్లో కూడా సిరి లెల్లా ఎవరనే చర్చ మొదలయ్యింది.ఆమె అసలు పేరు శిరీష లెల్లా(sireesha lella)సినిమా కోసం తన పేరుని సిరి గా మార్చుకుంది.అచ్చ తెలుగు అమ్మాయి అయిన శిరీష బాల్యం, విద్యాబ్యాసం మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కొనసాగింది.ఆ తర్వాత ఉన్నత విద్యకోసం ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ చేసి ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా కూడా సినిమాల్లో నటించాలనే కోరికతో హైదరాబాద్ వచ్చింది.ప్రతినిధి 2 ఆడిషన్స్ కి వెళ్లగా మేకర్స్ శిరీష ని సెలక్ట్ చేసారు. ఈ సినిమాలో సెట్స్ లో అడుగుపెట్టే వరకు రోహిత్ తో తనకి పరిచయం లేదు.

ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని అడిగితే ఇంకో మూడు సంవత్సరాలు దాకా పెళ్లి చేసుకోనని చెప్పింది.కానీ రోహిత్ తో ప్రేమలో పడి ఆ సినిమా వచ్చి ఆరు నెలలు కూడా గడవకముందే పెళ్లి చేసుకుంటుంది.డిసెంబర్ 15 న ఆ ఇద్దరి పెళ్లి జరగనుంది.

 

google-ad-img