TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ని నాని ఆపబోతున్నాడా! 

Nov 2, 2024 9:08AM

నాచురల్ స్టార్ నాని(nani)రీసెంట్ గా సరిపోదా శనివారం(saripoda sanivaram)తో మంచి హిట్ ని అందుకున్నాడు. కలెక్షన్స్ పరంగా నాని కెరీర్ లోనే  హయ్యెస్ట్ మూవీగా కూడా నిల్చింది.ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు హిట్ 3 లో చేస్తున్నాడు. 2022 లో అడవి శేషు(adavi seshu)హీరోగా వచ్చిన హిట్-2 (hit 2) కి సీక్వెల్‌గా ఆ చిత్రం తెరకెక్కుతుండగా, వెంకటేష్ తో సైంధవ్ చిత్రాన్ని తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.ఒక పవర్ ఫుల్  పోలీస్ క్యారక్టర్ లో నాని కనిపించబోతున్నాడు.

నాని రీసెంట్ గా తనకి దసరా(dasara)వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన  దర్శకుడు  శ్రీకాంత్ ఓదెల(srikanth odela)డైరెక్షన్‌లో ఒక సినిమాని అనౌన్స్ చేసాడు.ఆల్రెడీ ఆ చిత్రం అధికారకంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. దీంతో  పాటు పవన్ కళ్యాణ్(pawan kalyan)తో ఓజి ని తెరకెక్కిస్తున్న సుజిత్‌(sujeeth)తోనూ ఒక సినిమా ప్లాన్ చేశాడు.ప్రస్తుతం హిట్ 3 షూటింగ్ లో పాల్గొంటున్న నాని దీని తర్వాత సుజిత్ సినిమానే  చెయ్యాలనుకున్నాడంట.

 

ఎలాగూ ఓజి(og)షూటింగ్ చివరి దశలో ఉంది కాబట్టి, ఈ లోపు తను కూడా హిట్ 3 ని కంప్లీట్ చేసి,సుజిత్ సినిమాని పట్టాలెక్కించాలని భావించాడంట.కానీ ఇప్పుడు శ్రీకాంత్  బౌండెడ్ స్క్రిప్టుతో రెడీగా ఉండటంతో ఆ మవీనే ముందుగా మొదలుపెట్టేందుకు రెడీ అయ్యాడనే వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది.

 

google-ad-img