Home

»

Latest News

ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ధూమావతి సీన్ కట్ చేసినా ఆగ‌ని ట్రోలింగ్.!

Oct 22, 2026 4:22PM

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అక్టోబర్ 22 నుంచి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విమర్శలు కొనసాగుతున్నాయి.

థియేట్రికల్ వెర్షన్ నిడివి 2 గంటల 54 నిమిషాలు కాగా, ఓటీటీ విడుదలకు ముందు సినిమా రన్‌టైమ్‌ను తగ్గిస్తారనే ప్రచారం జరిగింది. ట్రోలింగ్‌కు గురైన సన్నివేశాలను తొలగిస్తారని చాలామంది భావించారు. అయితే, సినిమా నిడివిలో పెద్దగా మార్పులు చేయకుండా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ధూమావతి ఫైట్ ఎపిసోడ్‌లో ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న జడల్ తల్లి డ్యాన్స్ సన్నివేశాన్ని తొలగించారు. మొత్తంగా సుమారు నాలుగు నిమిషాల సన్నివేశాలను కట్ చేయడంతో పాటు, కొన్ని చోట్ల గ్రాఫిక్స్‌ను మెరుగుపరిచినట్లు సమాచారం.

అయితే, ఓటీటీ వెర్షన్‌లోనూ మిగిలిన సన్నివేశాలను నెటిజన్లు వదిలిపెట్టడం లేదు. సినిమా విడుదల సమయంలో చేసిన విమర్శలు, మీమ్స్‌ను మళ్లీ తెరపైకి తీసుకొస్తూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను టార్గెట్ చేస్తున్నారు. ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని మార్పులు చేస్తారని భావించినవారికి, పెద్దగా మార్పుల్లేకుండా సినిమా స్ట్రీమింగ్ కావడం చర్చనీయాంశమైంది. దీంతో ‘ది ప్యారడైజ్’ ఓటీటీ ఎంట్రీ తర్వాత కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగడం లేదు.

ఈ చిత్రంలో నానికి జోడీగా కయాదు లోహర్ నటించగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీర్తి సురేష్ ప్రత్యేక గీతంలో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, చెరుకూరి సుధాకర్ నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా, ఓటీటీలోనైనా ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చుకుంటుందా అనేది చూడాలి.

 

 

 

[Nani The Paradise OTT, The Paradise Netflix, Nani Movie OTT Release, Srikanth Odela Trolling, The Paradise OTT Version, Dhumavathi Scene Cut, The Paradise Social Media Reactions]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com