పవన్ కళ్యాణ్ పై నాని చేసిన కామెంట్స్ 240 దేశాలు విన్నాయి..మీరు వినలేదా
Nov 23, 2024 10:44AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)నాచురల్ స్టార్ నాని(nani)కి మధ్య చాలా మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా,స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన నాని అంటే, చాలా గౌరవమని పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.నాని కూడా పవన్ నాకు ఇన్స్పిరేషన్ అని చాలా సందర్బాలలో చెప్పడమే కాకుండా, మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ ని గెలిపించాలని బహిరంగంగానే స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు.
అసలు విషయానికి వస్తే దగ్గుబాటి రానా(rana)హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో(amazon prime video)లో 'ది రానాదగ్గుబాటి(the rana dabbubati)షో ఒకటి టెలికాస్ట్ కాబోతుంది.రెండువందల నలబై దేశాల్లో టెలికాస్ట్ అయ్యే ఈ షోకి మొదటి గెస్ట్ గా నాని హాజరయ్యాడు. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మొదటి ఎపిసోడ్‌ను వరల్డ్ ప్రీమియర్‌గా ప్రసారం కూడా చేశారు.ఆ షో లో పవన్ కళ్యాణ్ గురించి నాని మాట్లాడుతు సినిమాల్లో పవన్ కళ్యాణ్ స్టార్ గా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే.రాజకీయాల్లోను అదే స్థాయిలో ఎదిగి అక్కడ కూడా పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు.ఎంతో మందికి స్పూర్తిని కూడా ఇచ్చారని చెప్పాడు.దీంతో నాని చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలవడమే కాకుండా రెండువందల నలబై దేశాలు వింటున్నట్లయింది.ఇక ఈ రోజు నుంచి నాని ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది
ఈ షో లో రానా కూడా పవన్ గురించి మాట్లాడుతు పవన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన నిజంగానే సూపర్ స్టార్ అని కొనియాడాడు.ప్రియాంక మోహన్(priyanka mohan)తేజ సజ్జ (teja sajja)కూడా ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా రావడం జరిగింది.నాని సినిమాల విషయానికి వస్తే హిట్ 3 తో పాటు,దసరా దర్శకుడు తో ఒక మూవీ చేస్తున్నాడు.



