హైదరాబాద్ లో నాని జెండా
on Nov 16, 2013

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "జెండాపై కపిరాజు". సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కోయంబత్తూర్ లో పూర్తి చేసుకొని హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్ గా అమలపాల్ నటిస్తుంది. కె.ఎస్.శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం తనకు మంచి పేరుని తెస్తుందని అమల చాలా ఆశతో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



