TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

దసరా పైనే నాని ఆశలన్నీ!

Feb 1, 2023 9:20AM

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లో మొదటిసారి అవుట్ అండ్ అవుట్ ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. అది దసరా చిత్రంలో. శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుని తో ఆయన ఈ చిత్రం చేస్తున్నారు. మార్చి 30న ఈ సినిమా పాన్  ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. నేషనల్ లెవెల్ లో ఆడియన్స్‌ను అలరించాలంటే సినిమాలో తగినంత స్టఫ్ ఉండాలి. తన చిత్రంలో అంతటి కంటెంట్, స్ట‌ఫ్ ఉన్నాయని నాని నమ్మకంగా చెబుతున్నారు. ఒక ఊర మాస్  కథతో నాని వస్తున్నారు. దసరా మూవీ నానికి అసలు సిసలైన అగ్నిపరీక్ష. ఈ సినిమాతో మాస్ హీరోగా ప్రమోట్ కావాలని చూస్తున్నారు. నేచురల్ స్టార్ గా ఎదిగినా కూడా ఇంకా తాను టైర్ 2 హీరో గానే పరిగణించబడుతున్నారు. దాంతో ఆయన ఈసారి ఎలాగైనా తన రేంజ్‌ను పెంచుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందుకే దసరా సినిమా ప్రతి విషయంలోనూ నాని ఇన్వాల్వ్మెంట్  ఉందని తెలుస్తోంది. ధూమ్ ధామ్ సాంగ్ టీజర్ తో శాంపిల్ చూపించారు.  కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది.

నాని  కెరీర్ లోనే ఈ చిత్రం అత్యంత  హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని  స్ప‌ష్టంగా చెప్ప‌వ‌చ్చు.  నాని ఊర మాస్ యాటిట్యూడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటివరకు నాని నటించిన ఏ సినిమాకు రానటువంటి బజ్ దసరాకి వస్తోంది. సినిమా విషయంలో ఎక్కువగా హింట్స్ ఇవ్వ‌కుండా  జాగ్రత్త వహిస్తున్నారు. మరి నాని దసరా దుమ్ము దులిపేస్తుందా లేదా అనేది మార్చి 30న గాని చెప్పలేం. సౌత్ సినిమాలకు బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్, ఆద‌ర‌ణ ల‌భిస్తున్నాయి. నాని దసరాని  కూడా అక్కడ బాగానే ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్ లో ‘‘వీర్లపల్లి.. చుట్టూరా బొగ్గు కుప్పలు.. తొంగి చూస్తే గానీ కనిపియ్యని ఊరు. మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటుపడిన సంప్రదాయం’’ అనే డైలాగ్ తో పాటు  "నీయవ్వ ఎట్లయితే గట్లాయె.. గుండు గుత్తగా లేపేద్దాం బాంచన్" అంటూ తెలంగాణ యాసలో డైలాగ్స్ తో నాని అదరగొట్టారు. టీజ‌ర్ చివ‌ర‌లో కత్తికి ఉన్న నెత్తుటితో నాని వీర తిలకం పెట్టుకున్న షాట్ నెక్ట్స్ లెవ‌ల్లో ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. తెలంగాణ యాస‌తో నాని మాట్లాడిన తీరు, డైలాగ్స్ ప‌లికిన విధానం చూస్తే పుష్ప చిత్రంలో బ‌న్నీ చిత్తూరు మాండ‌లికానికి ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డాడో నాని ఈ తెలంగాణ యాస కోసం కూడా అంత‌గా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని అర్త‌మ‌వుతోంది.

google-ad-img