TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

నందమూరి వర్సెస్ నారా.. బాలయ్య ముందు నిలబడగలరా..?

Oct 22, 2024 12:12PM

సంక్రాంతికి నందమూరి, మెగా హీరోల సినిమాలు పోటీ పడటం సహజం. 2025 సంక్రాంతికి కూడా 'NBK 109'తో బాలకృష్ణ, 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. దీంతో నందమూరి వర్సెస్ మెగా వార్ లో ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈసారి సంక్రాంతికి నందమూరి వర్సెస్ మెగా వార్ తో పాటు.. నందమూరి వర్సెస్ నారా వార్ కూడా చూడబోతున్నాం.

తమిళ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'గరుడన్' తెలుగు రీమేక్ లో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

2025 సంక్రాంతిపై ఇప్పటికే పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. 'NBK 109', 'గేమ్ ఛేంజర్', 'మజాకా'తో పాటు వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూడో సినిమా కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పుడు 'గరుడన్' తెలుగు రీమేక్ కూడా పొంగల్ రేసులో చేరినట్లు తెలుస్తోంది. అదే జరిగితే నందమూరి వర్సెస్ నారా అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అనడంలో సందేహం లేదు. మరి అసలే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మామ బాలయ్య ముందు.. అల్లుడు రోహిత్ ఎంతవరకు నిలబడగలడో చూడాలి.

google-ad-img