నమ్రతతో మహేశ్ కమిట్ అయ్యింది అప్పుడే!
on Jun 30, 2020
సూపర్‌స్టార్ మహేష్‌బాబు వైఫ్, సూపర్ వుమన్ నమ్రతా మహేష్ మంగళవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మహేష్‌తో ఎప్పుడు ప్రేమలో పడినదీ, కమిట్ అయినదీ మొదలుకుని మహేష్ సినిమాలు స్ర్కిప్ట్ సెలక్షన్, సినిమాల వరకూ పలు విషయాలు చెప్పారు.
మహేష్‌తో ప్రేమలో పడ్డారని మీకెప్పుడు తెలిసింది?
న్యూజీలాండ్‌లో 52 రోజుల సుదీర్గమైన షెడ్యూల్ చేశాం. అక్కడ ‘వంశీ’ సినిమా లాస్ట్ డే షూటింగ్ రోజున ప్రేమలో పడ్డానని అర్థమైంది.
మీ పెళ్లికి మీ పేరెంట్స్ వెంటనే అంగీకరించారా?
మహేష్‌ను చూసిన క్షణంలోనే, అతనితో మా పేరెంట్స్ ప్రేమలో పడ్డారు.
మహేష్ బర్త్‌డే ప్లాన్స్ ఏంటి?
లాక్డౌన్ బర్త్‌డే! అందువల్ల, ఏ ప్లాన్స్ లేకపోవడమే బెస్ట్ ప్లాన్.
షూటింగ్స్‌కి మహేష్ ఫారిన్ వెళ్లినప్పుడు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారా?
మా ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంది. సో... ఇన్సెక్యూరిటీకి ఆస్కారం లేదు.
మహేష్, గౌతమ్ ఎక్కువగా ఏ గేమ్స్ ఆడతారు?
టెన్నిస్, గోల్ఫ్, సెవెన్ పిన్స్ ఆడటం వాళ్లకు ఇష్టం.
కృష్ణగారి గురించి...
తండ్రి కంటే ఎక్కువ. కూలెస్ట్ మామగారు.
మహేష్ స్ర్కిప్ట్ సెలక్షన్లో మీ పాత్ర ఉంటుందా?
మహేష్ పనిలో నేను జోక్యం చేసుకోను.
మీకిష్టమైన సినిమాలు?
ఒక్కడు, పోకిరి, దూకుడు, సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను
‘సర్కారు వారి పాట’ కథ గురించి చెప్పండి?
ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
‘ఒక్కడు’ పై మీ అభిప్రాయం?
‘ఒక్కడు’ క్లాసిక్ సినిమా. నా ఆల్‌టైమ్ ఫేవరెట్. మళ్లీ మళ్లీ చూసే సినిమా.
మీరు, మహేష్ కమిట్ అయిన డేట్ చెబుతారా?
ఫిబ్రవరి 10... మా పెళ్లైన రోజు.