Home

»

Latest News

‘గరుడవేగ’ దర్శకుడితో నాగార్జున?

Jun 15, 2020 11:26AM

 

సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున హిట్ ముఖం చూసి చాన్నాళ్ళయింది. 2016 సంక్రాంతికి విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తర్వాత నాగ్ నుంచి వచ్చిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. ‘ఊపిరి’, ‘నిర్మలా కాన్వెంట్’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘రాజు గారి గది 2’, ‘ఆఫీసర్’, ‘దేవదాస్’, ‘మన్మథుడు 2’.. ఇలా ఈ మ‌ధ్య నాగార్జున నుంచి వచ్చిన ఏ సినిమా కూడా కాసులు రాబట్టలేకపోయింది.

ఈ నేపథ్యంలో.. నాగ్ తదుపరి చిత్రాలపైనే ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’లో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు నాగ్. ‘ఊపిరి’ రచయిత అహిషోర్ సాల్మ‌న్.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే వేసవిలో ఈ సినిమా జనం ముందుకు వచ్చి ఉండేది.

ఇదిలా ఉంటే.. ‘వైల్డ్ డాగ్’ తరువాత నాగ్ నటించబోయే సినిమాపై క్లారిటీ వచ్చింది. ముందుగా అనుకున్నట్లుగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’తో కాకుండా మరో యాక్షన్ థ్రిల్లర్‌తో నాగ్ పలకరించే అవకాశం ఉందట. రాజశేఖర్ బౌన్స్ బ్యాక్ మూవీ ‘గరుడవేగ’ (2017)ని తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందట. నాగార్జున తనయుడు నాగ చైతన్య తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ని నిర్మిస్తున్న ఏషియన్ సునీల్ ఈ యాక్షన్ డ్రామాని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు.. ప్రవీణ్ గ‌త‌ చిత్రం ‘గరుడవేగ’ తరహాలో అండర్ కవర్ ఆపరేషన్ బ్యాక్ డ్రాప్‌తోనే ఈ సినిమా కూడా  రూపొందుతుందని సమాచారం. త్వరలోనే నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మ‌రి.. ఈ సినిమాతోనైనా నాగార్జున మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com