
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘స్టైల్’ సినిమాలో కనిపించినప్పటికీ.. అది కేవలం అతిథి పాత్రలకే పరిమితమైంది. పూర్తిస్థాయిలో ఇద్దరూ కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందనే విషయంలో తాజాగా నాగార్జున ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
చిరంజీవి, నాగార్జున మల్టీస్టారర్ గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఇద్దరు సీనియర్ నటులతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథ కూడా సిద్ధమైందనే టాక్ వినిపించింది. అయితే తాజాగా నాగార్జున చేసిన వ్యాఖ్యలతో ఈ కాంబినేషన్ విషయంలో మరోసారి ఆసక్తి మొదలైంది.
‘ఇట్లు అర్జున’ ప్రెస్ మీట్ సందర్భంగా చిరంజీవితో సినిమా ఎప్పుడు చేస్తారని నాగార్జునను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. తాను కూడా ఆ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నానని చెప్పారు. చిరంజీవితో తనకు మంచి స్నేహం, అద్భుతమైన ర్యాపో ఉందని.. ఇద్దరూ ఎప్పుడు కలిసినా కలిసి ఒక సినిమా చేయాలని మాట్లాడుకుంటామని తెలిపారు.
అయితే ఇలాంటి క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే సరైన సమయం రావాలని నాగార్జున అన్నారు. ఆ సమయం తప్పకుండా వస్తుందని, అప్పుడు ఈ సినిమా కచ్చితంగా జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో చిరంజీవి, నాగార్జున కలిసి నటించేందుకు సిద్ధంగానే ఉన్నారని.. ఇద్దరికీ సరిపోయే కథ, సమయం కోసం ఎదురుచూస్తున్నారని అర్థమవుతోంది.

గతంలో చిరంజీవి, నాగార్జున కాంబినేషన్లో అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. ఆయన ఇప్పటికే కథను సిద్ధం చేశారని, కుటుంబ భావోద్వేగాలు, కామెడీ, మాస్ అంశాలతో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చేలా సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు.
నాగార్జున తాజా వ్యాఖ్యల్లో కూడా దర్శకుడు అనిల్ రావిపూడి పేరును ప్రస్తావించలేదు. కాబట్టి ఈ మల్టీస్టారర్ ఆయన దర్శకత్వంలోనే ఉంటుందా? లేక మరో దర్శకుడు ఇద్దరు నటులకు సరిపోయే కథతో ముందుకొస్తారా? అనేది చూడాలి.
ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం.. అసలు ఏమైంది?.. ఇప్పట్లో విడుదల కష్టమేనా.?
[Chiranjeevi Nagarjuna Multistarrer, Megastar Chiranjeevi, Akkineni Nagarjuna, Itllu Arjuna Movie, Anil Ravipudi, Telugu Film News]




