మరో దర్శకుడికి చైతు గ్రీన్ సిగ్నల్
Sep 16, 2013 2:41PM

ఆంజనేయులు, సోలో వంటి చిత్రాల దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో, నాగ చైతన్య హీరోగా ఓ చిత్రం తెరకేక్కబోతుంది. ఈ చిత్రానికి ‘శూన్యం’ అని టైటిల్ పెట్టినట్టు సమాచారం. ఈ చిత్రం కథ విన్న వెంటనే నాగచైతన్య ఓకే చెప్పాడనితెలిసింది. కామెడి, మాస్ మసాలా చిత్రంగా రూపొందనున్నఈ సినిమాని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నాడని తెలిసింది.
ప్రస్తుతం నాగచైతన్య "ఆటోనగర్ సూర్య", "మనం", మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాల తర్వాత చైతు-పరుశురాం ల చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.




