Home

»

Latest News

ప్రభాస్ ఫ్యాన్స్​కు షాక్: 'ఫౌజీ' రిలీజ్ డేట్‌కి 'వృషకర్మ'.. అసలేం జరుగుతోంది.?

Sep 9, 2026 2:22PM

'తండేల్' సూపర్ సక్సెస్ తర్వాత అక్కినేని నాగ చైతన్య తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ'. 'విరూపాక్ష' లాంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీ థ్రిల్లర్‌తో ఆకట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌కి సంబంధించి ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 3న థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ షెడ్యూల్స్ వేగంగా పూర్తవుతుండగా.. రాజస్థాన్‌లోని రాజభవనాల్లో భారీ యాక్షన్ సీన్స్, మిస్టరీ సీక్వెన్సెస్ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

డిసెంబర్ రేస్‌లో మిగతా పాన్-ఇండియా సినిమాల డేట్లు అటూ ఇటూ మారే అవకాశాలు కనిపిస్తుండటంతో, 'వృషకర్మ' టీమ్ ఖాళీగా ఉన్న డిసెంబర్ ఫస్ట్ వీక్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ప్రభాస్, హను రాఘవపూడి భారీ 'ఫౌజీ' మూవీ వాయిదా పడుతుందన్న సమాచారంతో.. 'వృషకర్మ' టీం ఆ డేట్ పై కన్నేసినట్లు సమాచారం.

'విరూపాక్ష'తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన కార్తీక్ దండు, ఈసారి 'వృషకర్మ' కోసం మైథాలజీ, హిస్టారికల్ ఎలిమెంట్స్, మిస్టరీని మిక్స్ చేసి అంతకుమించిన గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్ చేశారట.

ఈ సినిమాలో నాగ చైతన్య ఒక ట్రెజర్ హంటర్‌గా కనిపిస్తుండగా, మీనాక్షి చౌదరి 'లక్ష్య' అనే ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తోంది. ఇక 'లపాతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా మెప్పించబోతున్నారు. 

సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూ. 120 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కానుంది.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మిస్టికల్ థ్రిల్లర్ గా వస్తున్న 'వృషకర్మ' నాగచైతన్య కెరీర్‌లోనే మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి డిసెంబర్ 3న బాక్సాఫీస్ దగ్గర 'వృషకర్మ' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

 

 

 

[Vrushakarma Release Date, Naga Chaitanya, Karthik Dandu, Meenakshi Chaudhary, Prabhas, Fauzi Movie, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com