Home

»

Latest News

Vrushakarma: నాగ చైతన్య పడిపోయాడు.. మరి అదే టైంలో ఈవెంట్ లో ఉంది ఎవరు 

Mar 5, 2026 3:11PM

 

-కుర్చీలో నుంచి పడబోయిన నాగ చైతన్య 
-సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ 
-అభిమానుల కంగారు 

తండేల్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన యువసామ్రాట్ 'నాగచైతన్య'(Naga Chaitanya)ఈ సారి కూడా హిట్ విషయంలో తగ్గే ప్రసక్తే లేదని 'వృషకర్మ'(VrushaKarma)తో శర వేగంగా ముస్తాబవుతున్నాడు. హిట్ విషయంలో తగ్గేదే లేదని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలతో పాటు 'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండు వృషకర్మ ని తెరకెక్కిస్తుండటం. ఈ రోజు చిత్ర యూనిట్  గ్లింప్స్ ని రిలీజ్ చేసింది. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ఇందుకు వేదికగా నిలవగా అభిమానులు భారీగా పోటెత్తారు. కానీ అదే అభిమానులని సదరు వేడుక ఆందోళనకి గురి చేసింది. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం

గ్లింప్స్ ఈవెంట్ కి నాగ చైతన్య కూడా హాజరయ్యాడు. అభిమానులని తన మాటలతో ఉత్తేజపర్చడమే కాకుండా సినిమా గురించి పలు విషయాలు చెప్పాడు. అనంతరం మీడియాతో ముఖాముఖి కార్యక్రమానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సందర్భంగా స్టాఫ్ కొంత మంది కుర్చీలని వేశారు. అందులోని ఒక కుర్చీలో నాగ చైతన్య కూర్చోబోతుంటే కుర్చీ ఒక వైపుకి వంగిపోయింది. దీంతో చైతన్య ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. వెంటనే అభిమానులతో పాటు అక్కడున్న వారందరు టెన్షన్ పడ్డారు. చైతన్య కి కార్తీక్ దండు(karthik dandu)చేయి అందించడంతో పైకి లేచాడు. ఆ తర్వాత యధావిధిగా మీడియాతో వృషకర్మ గురించి ముచ్చటించాడు.

also read: The paradise: ఆయా షేర్ స్టెప్ వెనకున్న అసలు నిజం బయటపడింది

ఇక సుమారు నిమిషం యాబై సెకన్ల నిడివితో ఉన్న గ్లింప్స్ ని చూస్తుంటే సెల్యులాయిడ్ పై  మైథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ రూపంలో ఒక అద్భుతం జరిగే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. రెండు వెరీయేషన్స్ లో నాగచైతన్య కనిపిస్తుండగా అతేంద్రియ శక్తీ మేల్కొన్నప్పుడు, సృష్టి దర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మ ని ఎంచుకుంటుంది అనే డైలాగ్స్ మూవీపై మరింత ఆసక్తిని కలుగచేసే విధంగా ఉన్నాయి. అత్తారింటికి దారేది ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా హిట్ చిత్రాల భామ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary)హీరోయిన్ గా చేస్తుంది.   

 

 

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com