TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

నాగచైతన్య "గౌరవం" ఫిబ్రవరి 25 నుండి

Feb 3, 2012 9:05AM

నాగచైతన్య "గౌరవం" ఫిబ్రవరి 25 నుండి షూటింగ్ ప్రారంభించుకోనుంది. వివరాల్లోకి వెళితే అన్నపూర్ణ స్టుడియోస్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి హీరోయిన్ గా, "గగనం" రాధా మోహన్ దర్శకత్వంలోతెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం "గౌరవం". ఈ "గౌరవం" చిత్రం ఫిబ్రవరి 25 న పూజాకార్యక్రమాలతో లాంఛనంగా షూటింగ్ ప్రారంభమవుతుంది.

కానీ ఈ "గౌరవం" చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం మార్చ్ 5 వ తేదీ నుండి ప్రారమభమవుతుంది. ఈ "గౌరవం" చిత్రం షుటింగ్ రాజమండ్రిలో 15 రోజులూ, బెంగుళూరులో 45 రోజులు షూటింగ్ జరుపుతారు. ఈ "గౌరవం" చిత్రం ఒక విభిన్నమైన ప్రేమకథాంశంతో తెరకెక్కనుంది.

google-ad-img