చైతు దుర్గ రేపే ప్రారంభం
Feb 24, 2014 12:14PM

నాగచైతన్య, హన్సిక జంటగా నటించనున్న "దుర్గ" చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఇటీవలే లాంచనంగా ప్రారంభించారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ రేపు(ఫిబ్రవరి25) హైదరాబాదులో ప్రారంభం కానుంది. ఆకుల శివ కథ అందిస్తున్నాడు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం చైతన్య నటించిన "ఆటోనగర్ సూర్య" విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే "మనం", "ఒక లైలా కోసం" చిత్రాలు కూడా షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి.




