ENGLISH | TELUGU  

పెద్ద యాక్సిడెంట్‌లో నభా ఎడమభుజం ఎముకలు విరిగాయి!

on Jan 10, 2023

 

కొద్ది రోజులుగా అందాల తార నభా నటేశ్ ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, తన ఫొటోషూట్స్‌తోనో, తన వెకేషన్ పిక్స్‌తోనో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉండే ఆమె మౌనంగా ఉంటూ వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత ఆమె కనిపించకుండా ఉన్నదానికి కారణం తెలిసింది. తనకు యాక్సిడెంట్ అయ్యిందనే విషయాన్ని ఆమె స్వయంగా బయటపెట్టేదాకా ఆ విషయం బయటకు పొక్కకపోవడం గమనార్హం.

మంగళవారం ఆమె సోషల్ మీడియా ద్వారా తనకు జరిగిన ప్రమాదం గురించి వెల్లడించింది. "కొంతకాలంగా నేను సీన్‌లో లేకపోవడంతో మిమ్మల్ని నేనెంతగా మిస్సయ్యానో మీరూ నన్ను కచ్చితంగా అంతే మిస్సయి ఉంటారని అనుకుంటున్నా. గత ఏడాది క్లిష్టంగా గడిచింది. నేను ఓ పెద్ద యాక్సిడెంట్‌కు గురయ్యాను. నా ఎడమ భుజంపై పలుచోట్ల ఎముకలు విరిగాయి. దాంతో పలు దఫాలుగా క్లిష్టమైన సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఊహించడానికి అలవికాని శారీరక, మానసిక బాధను అనుభవించాను. గాయం నుంచి కోలుకుంటూ, నేను బాగా ఇష్టపడే సినిమాల నుంచి దూరం కావడం అంటే చిన్న విషయం కాదు.
ఇంతదాకా నేను చేసిన పని వల్ల లభించిన మీ ప్రేమే నాకు ధైర్యాన్నిచ్చింది. ఇప్పుడు పూర్తిగా కోలుకొని తిరిగి వస్తున్నానని, ఎప్పటికంటే మరింత బలంగా నిలబడుతున్నానని చెప్పడానికి సంతోషంగా ఉంది." అని ఆమె రాసుకొచ్చింది.

"హలో 2023.. అయాం ఆల్‌రెడీ ఫర్ యూ!" అంటూ ఆ నోట్‌ను ముగించింది నభా. 2021లో అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో సినిమాల్లో నటించాక, మళ్లీ ఇంతదాకా ఆమె మరో సినిమాలో కనిపించలేదు. త్వరలోనే ఆమె కెమెరా ముందుకు వచ్చి, మనల్ని అలరిస్తుందని ఆశిద్దాం.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.