ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ సిరీస్ ను మన ముందుకు తీసుకొస్తోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రధాన పాత్రల్లో ఆహా ఒరిజినల్ "నా వైఫ్ మిస్సింగ్" ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనుంది. "నా వైఫ్ మిస్సింగ్" సిరీస్ ను లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై శివ కంఠంనేని నిర్మించారు. స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు.
ఈ రోజు స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేతుల మీదుగా "నా వైఫ్ మిస్సింగ్" ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - బాలు, బాలసుబ్రహ్మణ్యం (వరుణ్ సందేశ్) తన భార్య స్వప్న (శ్వేతాబసు ప్రసాద్) ఆచూకీ తెలియడం లేదంటూ అమలాపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. భార్య కనిపించకుండా పోయిన ఒక రోజు తర్వాత బాలు ఫిర్యాదు చేయడం పోలీసులకు అనుమానం కలిగేలా చేస్తుంది. పోలీసులు బాలునే నేరస్తుడు అనే కోణంలో విచారణ మొదలుపెడతారు. మరోవైపు బాలు తన కూడా తన భార్య ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంటాడు. బాలు మరొక అమ్మాయితో స్నేహంగా ఉండటం, స్వప్న బాధపడటం ట్రైలర్ లో చూపించారు. చివరలో బాలును పోలీసులు అరెస్ట్ చేయడం ట్రైలర్ లో ఆసక్తి కలిగిస్తోంది. స్వప్న కనిపించకుండా పోవడానికి కారణం ఎవరు, ప్రేమించిన ఆమె భర్త బాలునే కారణమా, అసలేం జరిగింది అనే అంశాలతో నా వైఫ్ మిస్సింగ్ ట్రైలర్ ఆసక్తి కలిగిస్తోంది.
[naa wife missing web series trailer release, boyapati srinu released naa wife missing web series trailer, varun sandesh, swetha basu prasad]




