Home

»

Latest News

Mehreen Pirzada: మెహ్రీన్ పెళ్లి చేసుకుంది ఇతన్నే.. ఫస్ట్ ఎంగేజ్ మెంట్ కి, ఇప్పటి పెళ్లికి  తేడా ఇదే 

Apr 27, 2026

 

హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ తెలుగు ప్రేక్షకులని తన ట్రాప్ లో పడేలా చేసిన భామ మెహ్రీన్(Mehreen Pirzada).. గోల్డెన్ లెగ్ అనే పేరు కూడా తెచ్చుకున్న మెహ్రిన్ రీసెంట్ గా సోషల్ మీడియాలో తన పెళ్లి పిక్స్ షేర్ చేసి సోషల్ మీడియాని తన ఆదీనంలో ఉంచుకుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.


ఏప్రిల్ 26 న అంటే నిన్న అర్ష్ ఔలక్ తో   మెహ్రిన్  వివాహం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకల్లో మెహ్రీన్ మెరిసిపోయారు. పెళ్లికి ముందు జరిగిన మెహందీ, హల్దీ వేడుకల నుండి మొదలుకొని ప్రధాన కళ్యాణం వరకు ప్రతి ఘట్టం ఎంతో వేడుకగా సాగింది. తన పెళ్లి రోజున మెహ్రీన్ ధరించిన డిజైనర్ లెహంగా ,ప్రత్యేకమైన ఆభరణాలు ఆమెకి రాజసం తెచ్చిపెట్టాయి. ముఖంలో నవ వధువు కళ ఉట్టిపడుతుండగా, ఆమె చిరునవ్వు అభిమానులను కట్టిపడేస్తోంది. జంట చూడముచ్చటగా ఉందని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా మెహ్రీన్‌తో కలిసి పనిచేసిన టాలీవుడ్ స్టార్స్ మరియు స్నేహితులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also read: Archana Puran singh: ప్రముఖ నటి ఇంట క్రెడిట్ కార్డు స్కామ్.. మీరు కూడా ఉంటారేమో జాగ్రత్త 

 ఆమె వెడ్డింగ్ ఆల్బమ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ కొత్త ప్రయాణంలో మెహ్రీన్ మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆమె వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని మనమూ కోరుకుందాం. మెహ్రీన్ పెళ్లి వేడుకలకు సంబంధించిన మరిన్ని అద్భుతమైన దృశ్యాలను మీరు ఈ ఫోటో గ్యాలరీలో వీక్షించవచ్చు.. మెహ్రీన్ కి గతంలో అంటే 2021 లో  హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు  భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ జరిగి క్యాన్సిల్ అయ్యింది. నాచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. మరి పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతారా లేదా అనేది చూడాలి. 



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com