Home

»

Latest News

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ఒక్క ట్వీట్‌ వేయలేడా?

Jun 05, 2020

 

జూనియర్‌ యన్టీఆర్‌ అభిమాని కాదని చెప్పడంలో తప్పేముంది? అని కథానాయిక మీరా చోప్రా ప్రశ్నిస్తోంది. తెలుగులో దాదాపు పదిహేనేళ్ల క్రితం పవన్‌కల్యాణ్‌ ‘బంగారం’ చిత్రంలో, తర్వాత ‘వాన’, ‘గ్రీకు వీరుడు’ చిత్రాల్లో నటించిన ఈ ప్రియాంకా చోప్రా కజిన్‌ను టాలీవుడ్‌ ఎప్పుడో మర్చిపోయింది. పైగా, హిందీలోనూ పెద్ద సినిమాలు చేయడం లేదు. చిన్న చిన్నవి చేస్తోంది. అటువంటి మీరా చోప్రా పేరు రెండు మూడు రోజులుగా జాతీయ, తెలుగు ప్రాంతీయ వార్తాల్లో విపరీతంగా వినిపిస్తోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ కంటే మహేష్‌బాబు అంటే ఎక్కువ ఇష్టమని చెప్పడం, జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌ అభిమానిని కాదని అనడం కొందరికి ఆగ్రహం తెప్పించింది. ఎన్టీఆర్‌ అభిమానులుగా చెప్పుకొనే కొందరు చేసిన ట్వీట్స్‌ వివాదానికి కారణమైన సంగతి తెలిసింది. ఆల్రెడీ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కంప్లయింట్‌ చేసిన మీరా చోప్రా, ఇప్పట్లో వివాదాన్ని వదిలేలా కనపడడం లేదు.

‘‘లక్షలాది ప్రజలను ప్రభావితం చేయగల పవర్‌ స్టార్స్‌కి ఉంది. వాళ్లు ఆ పవర్‌ని ఎందుకు ఉపయోగించరు? సమాజంలో సానుకూల మార్పు కోసం ఆ పవర్‌ ఉపయోగించలేనప్పుడు స్టార్‌డమ్‌ ఎందుకు? జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒక్క ట్వీట్‌ వేయలేడా?’’ అని మీరా చోప్రా ప్రశ్నిస్తోంది. ఎన్టీఆర్‌ మౌనం తనని ఆశ్చర్యపరిచిందని ఆమె తెలిపింది. ‘‘ఎంతమంది మీద కేసులు పెడతాం? ఎంతమందిని జైలుకు పంపిస్తాం? వాటి కంటే స్టార్‌ వచ్చి అభిమానులకు సందేశం ఇవ్వడం ముఖ్యం. త్వరలో ఎన్టీఆర్‌ ఆ పని చేస్తారని ఆశిస్తున్నా’’ అని మీరా చోప్రా అన్నది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com