Home

»

Latest News

ఈ మూవీ వల్ల 20 జంటలు ఆత్మహత్య.. ఇందుకు బాధ్యులు ఎవరు

Apr 27, 2026

 

 

ప్రేమ (LOve).. ప్రేమికుల మధ్య ఏర్పడే కల్లా కపటం, పొల్యులేషన్ లేని పవిత్రమైన ప్రేమ.. ఒకరు పుట్టిస్తేనో, ప్రభావితం చేస్తేనో, సినిమాల వల్లనో, పక్కింటోళ్లు ప్రేమించుకుంటున్నారనో, పైత్యం వలనో, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ వలనో ఒక అమ్మాయి,అబ్బాయి మధ్య ఏర్పడే ప్రేమ, ప్రేమ కిందకి రాదు. సదరు యువతీ యువకుడు తొలి సారి చూసుకున్నప్పుడు ఒకరి కోసం ఒకరం జీవించడానికి, అవసరమైతే మరణించడానికి పుట్టామని అనిపిస్తుంది. అదే నిజమైన ప్రేమ. సింపుల్ గా చెప్పాలంటే ప్రేమ అనేది స్వయంభూగా మన హృదయంలో కొలువు తీరాలి. అప్పుడు ఆ ప్రేమని  చూసి  దేవతలు సైతం ఇన్ స్ప్రెషన్ పొందటంతో పాటు ఆ ప్రేమికుల గురించి కథలుగా కూడా చెప్పుకుంటారు. అటువంటి ప్రేమతో కూడిన  చిత్రమే మరో చరిత్ర(Maro Charitra). ఈ చిత్రం తర్వాత జరిగిన బాధాకరమైన  సంఘటనని దేవతలు కథలుగానే చెప్పుకునే ఉంటారు. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.


లెజండ్రీ దర్శకుడు బాలచందర్(K. Balachander)తెరకెక్కించిన 'మరో చరిత్ర'  1978 లో రిలీజయ్యింది. కమల్ హాసన్(Kamal Haasan),సరిత(Saritha)జంటగా చేయగా అపురూపమైన ప్రేమ కావ్యాల్లో ఒకటిగా నిలిచి  . భాషా భేదం లేని ప్రేమని చాటిచెప్పి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా, యువతను విపరీతంగా ప్రభావితం చేసింది. అయితే, ఒక చీకటి కోణాన్ని కూడా తనలో ఇముడ్చుకుంది. సినిమా ముగింపు చూసి ప్రేమికులు చేసిన సాహసాలు దర్శకుడిని సైతం కలచివేశాయి. హీరో హీరోయిన్లుగా ఒకరినొకరు కలుసుకోలేక, పర్వతంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం మూవీ క్లైమాక్స్ .ఈ విషాదకర ముగింపు చూసి భావోద్వేగానికి లోనైన సుమారు 40 మందికి పైగా ప్రేమికులు నిజ జీవితంలో కూడా అదే విధంగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తమ ప్రేమ విఫలమైందన్న బాధతో లేదా తమను విడదీస్తారన్న భయంతో సినిమాని అనుకరిస్తూ ప్రాణాలు తీసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

also read:  Puri Jagannadh: పూరి జగన్నాధ్  పర్సు ఖాళీనా!


సినిమా ప్రభావంతో ఇంతమంది చనిపోవడం దర్శకుడు కె. బాలచందర్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక కళాఖండాన్ని సృష్టించాలనుకున్న తన ప్రయత్నం ఇంతటి విషాదానికి దారితీయడంతో ఆయన ఎంతగానోకలత చెందారు. ఈ క్రమంలోనే ఆయన ఒక బహిరంగ ప్రకటన విడుదల చేస్తూ క్షమాపణలు కోరారు. "సినిమా అనేది కేవలం వినోదం కోసం మాత్రమే, దానిని నిజ జీవితంలోకి తీసుకోవద్దు. ప్రేమ అంటే ప్రాణాలు తీసుకోవడం కాదు, కలిసి బతకడం" అని యువతకి  విజ్ఞప్తి చేయడంతో పాటు కళాకారుడిగా ఎంతో గర్వపడే సినిమా, వ్యక్తిగా తనను ఎంతో బాధించిందని  ఆవేదన వ్యక్తం చేశారు.

 

తెలుగులో వచ్చిన ఈ ప్రభావాన్ని చూసిన బాలచందర్, హిందీలో 'ఏక్ దూజే కేలియే'గా రీమేక్ చేసేటప్పుడు క్లైమాక్స్‌ విషయంలో చాలా ఆలోచించారు. కానీ, కథా పరంగా ముగింపు మారితే సినిమా ఆత్మ దెబ్బతింటుందని భావించి అక్కడ కూడా విషాద ముగింపునే ఉంచారు. కాకపోతే సినిమా ప్రారంభంలోనే ఇది కేవలం కల్పితమని, ఎవరూ అనుకరించవద్దని హెచ్చరికలు జారీ చేశారు.  ఒక సినిమా సమాజంపై ఎంతటి ముద్ర వేయగలదో చెప్పడానికి 'మరో చరిత్ర' ఒక నిలువెత్తు సాక్ష్యం. కానీ సినిమా ప్రేమికులతో పారు అందరు గమనించాల్సింది ఏంటంటే సిల్వర్ స్క్రీన్ పై కనిపించేవి కేవలం క్యారక్టర్ లేనని నిజ జీవితం అంతకంటే విలువైనదని మనం గుర్తించాలి.  

 



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com