Home

»

Latest News

'మండాడి' ఫస్ట్ రివ్యూ: అసలు స్టోరీ ఏంటి.. విలన్‌గా సుహాస్ హిట్ కొట్టాడా.?

Sep 8, 2026 5:24PM

విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ యాక్టర్ సూరితో కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'మండాడి' సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఇటీవల సెన్సార్ పనులను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైపోయింది.

సెంట్రల్ బోర్డ్ ఈ చిత్రానికి UA16+ సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఇక ఈ సినిమా నిడివిని క్రిస్పీగా, ఎక్కడా బోర్ కొట్టకుండా 2 గంటల 30 నిమిషాలు (150 నిమిషాలు) గా లాక్ చేశారు. నేటితరం ప్రేక్షకులకు పర్ఫెక్ట్ పేసింగ్‌తో ఉండేలా ఈ సినిమాను ఎడిట్ చేశారట.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సముద్రం, మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ఇది. సముద్రంలో తనదైన నైపుణ్యంతో చేపల వేట సాగించే ముత్తుకాళి పాత్రలో సూరీ నటించారు. కాళి కేవలం జాలరి మాత్రమే కాదు.. ఆ ప్రాంతంలోనే తిరుగులేని బోట్ రేసర్. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల తన ఊరిని, తన ప్రజలను వదిలేసి దూరంగా బతుకుతుంటాడు. అలాంటి సమయంలో తన సొంత ఊరి మత్స్యకారులకు తీవ్రమైన ఆపద ఎదురవుతుంది. తన వాళ్ల కోసం, తన గ్రామం కోసం కాళి మళ్లీ తిరిగొస్తాడు. తన సహచరులతో కలిసి సంప్రదాయ పడవ పందాల్లో దిగి తొడగొడతాడు.

ఇందులో సట్టై పులి అనే పవర్‌ఫుల్ అండ్ కన్నింగ్ పాత్రలో సుహాస్ కనిపించబోతున్నాడు. కాళికి చిరకాల ప్రత్యర్థి అయిన సట్టై పులి.. ఎలాంటి కుట్రలు చేశాడు? కుతంత్రాలతో కాళిని ఎలా దెబ్బతీయాలని చూశాడు? సముద్రం అలలపై కాళికి, సట్టై పులికి మధ్య జరిగిన ఆ పడవ పందాల పోరు ఎంత ఉత్కంఠగా సాగింది అనేదే ఈ సినిమా మెయిన్ హైలైట్.

డైరెక్టర్ వెట్రీమారన్ శిష్యుడైన మతిమారన్ పుగళేంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దాంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సముద్రంలో చిత్రీకరించిన బోట్ రేసింగ్ సీన్స్ హాలీవుడ్ లెవెల్‌లో ఉన్నాయని ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే జీవీ ప్రకాశ్ కుమార్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రచ్చ లేపాడని టాక్.

సుహాస్ మరోసారి తన పెర్ఫార్మెన్స్‌తో ఫిదా చేశారట. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్, సెకండాఫ్‌లో వచ్చే సూరి-సుహాస్ ముఖాముఖి సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించడం ఖాయమని అంటున్నారు. గ్రామీణ వాతావరణాన్ని నాచురల్‌గా చూపిస్తూనే.. ఎక్కడా కథనం స్లో అవ్వకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రా విజ్యువల్స్ ఈ సినిమాకు ప్రాణం పోసాయని తెలుస్తోంది.

సూరీ, సుహాస్ ఇద్దరూ పోటాపోటీగా నటించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

 

 

 

[Mandaadi First Review, Mandaadi Censor Talk, Mandaadi Review, Suhas, Soori, Mathimaran Pugazhendhi, Telugu Movie Review, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com