Home

»

Latest News

మన శంకర వరప్రసాద్ 50 డేస్ సెంటర్స్ ఇవే.. బాలకృష్ణకి కృతజ్ఞతలు 

Mar 02, 2026


-రికార్డు సెంటర్స్ లో యాభై రోజులు 
-అభిమానులు, మూవీ లవర్స్ హ్యాపీ 
-మరి బాలయ్య కి ధన్యవాదాలు ఎందుకు 

హిట్ కి జస్ట్ గ్యాప్ ఇచ్చానంతే.. కానీ హిట్ కొడితే మాత్రం దాని స్థాయి ఇలా ఉంటుందని మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)తో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)మరోసారి నిరూపించాడు. తన రీ ఎంట్రీ లో ఇప్పటికి వరకు ఐదు చిత్రాల వరకు చేసినా శంకర వరప్రసాద్ నే రీ ఎంట్రీ మూవీ అంటున్నారంటే ఏ స్థాయి విజయమో కూడా అర్ధం చేసుకోవచ్చు. పైగా విక్టరీ వెంకటేష్(Venkatesh)కట్ అవుట్ కి ఉన్న చరిష్మా తోడవ్వడంతో  400 కోట్ల గ్రాస్ దాకా రాబట్టి అచ్చ తెలుగు సినిమాకి ఉన్న మార్కెట్ ని తెలియచేసింది. ఈ రోజుతో మన శంకర వరప్రసాద్ యాభైయ్యవ    రోజులోకి అడుగుపెట్టడంతో సెంటర్స్ లిస్ట్ పై అభిమానుల్లో, మూవీ లవర్స్ లో ఆసక్తి నెలకొని ఉంది. మరి వాటి డీటెయిల్స్ చూద్దాం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 109 పైగా సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. మేకర్స్ ఈ   విషయాన్నీ అధికారకంగా ధ్రువీకరిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. సదరు పోస్టర్ లో జిల్లాల వారీగా రన్ అయిన థియేటర్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో మెగా అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో సరికొత్త జోష్ వచ్చినట్లయింది. సోషల్ మీడియా వేదికగా  వాళ్ళు స్పందిస్తు ప్రస్తుత సినీ కలికాలంలో ఒక సినిమా ఎంత బాగున్నా యాభై రోజులు ఆడటం అనేది గగనమైపోయింది. కానీ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ఈ విషయంలో కళామతల్లి ఋణం తీర్చుకుంటు 50 డేస్ కి ఎక్స్ పైరీ డేట్ ఉండదని  నిరూపిస్తున్నారనే కామెంట్స్ చేస్తున్నారు. అఖండ తో బాలకృష్ణ(Balakrishna) అర్ద శతదినోత్సవ వేడుకకి రిబ్బన్ కట్ చేసిన విషయం తెలిసిందే.   

 

also read:  Balakrishna:  బాలయ్య కి అభిమానుల విన్నపం

ఇక మన శంకర వర ప్రసాద్ కి సంబంధించిన అర్ధ శతదినోత్సవ వేడుకల్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈవెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి. ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ ఓటీటీలో రికార్డ్స్ వాచ్ టైం మినిట్స్ తో దూసుకుపోతుంది.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com