Home

»

Latest News

మమ్ముట్టి బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. 'ఓమ్' నుండి పవర్ ఫుల్ లుక్.!

Sep 7, 2026 7:24PM

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజ్‌లు అందుతున్నాయి. కోలీవుడ్ విలక్షణ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘ఓమ్’ (Om - Chapter 1: Udhiram - The Blood Wood) నుంచి మేకర్స్ ఒక సాలిడ్ గ్లింప్స్ వీడియోను విడుదల చేసి ఫ్యాన్స్‌కు అద్భుతమైన బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు.

ఈ స్పెషల్ గ్లింప్స్‌లో మమ్ముట్టి ‘బుర్మా కార్తికేయన్’ (సియా) అనే పవర్ ఫుల్ మరియు గ్రే-షేడ్స్ ఉన్న ఇంటర్నేషనల్ స్మగ్లర్ పాత్రలో దర్శనమిచ్చారు. పోలీస్ స్టేషన్ మోస్ట్ వాంటెడ్ ఖైదీల లిస్ట్‌లో ఆయన ఫొటో ఉండటం, ఒకవైపు ఖాకీలు ఆయన కోసం గాలిస్తుంటే.. మరోవైపు పోలీసులు వెతుకుతున్న కార్తికేయన్ ఏమాత్రం భయం లేకుండా పోలీస్ స్టేషన్ లోపలే ప్రశాంతంగా కూర్చుని మ్యాచ్ ఎంజాయ్ చేసే సీన్ మమ్ముట్టి స్వాగ్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది.

జైలు లోపల శత్రువుల పై విరుచుకుపడటం, బెయిల్ మీద బయటకు వచ్చి తన సొంత సామ్రాజ్యాన్ని నడిపించే సన్నివేశాల్లో ఆయన చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్, నడవడిక మాస్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ గ్లింప్స్‌కు సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేసింది.

‘అమరన్’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, యంగ్ లీల శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా, దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా కీలక పాత్ర పోషిస్తున్నారు.

ధనుష్‌కు చెందిన 'వుండర్‌బార్ ఫిల్మ్స్' మరియు 'ఆర్‌టేక్ స్టూడియోస్' సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మమ్ముట్టి మళ్లీ తమిళ చిత్రసీమలోకి రీ-ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా కోసం సౌత్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

 

[Mammootty Birthday Om Movie Glimpse, Mammootty Burma Karthikeyan Avatar, Dhanush Mammootty Om Tamil Movie, Rajkumar Periasamy Om Movie Updates, Om Chapter 1 Udhiram Release Date]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com